‘రాచకొండ ఎత్తిపోతల పథకంతోనే నారాయణపురం మండలానికి శాశ్వత సాగునీరు’
రాచకొండ ఎత్తిపోతల పథకంతోనే నారాయణపురం మండలానికి శాశ్వత సాగునీరు అందుతుందని సీపీఐ(ఎం) నాయకులు అన్నారు. రాచకొండ ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణపురం మండలానికి శాశ్వత సాగునీరు సాధించడమే లక్ష్యంగా సీపీఐ(ఎం) సమస్త నారాయణపురం మండల పార్టీ ఆధ్వర్యంలో...
– 75 కిలోమీటర్ల పాదయాత్రతో చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్న సీపీఐ(ఎం) శ్రేణులు
– పాదయాత్ర బృందానికి ప్రజల ఘన స్వాగతం
చౌటుప్పల్, నవంబర్ 03 : రాచకొండ ఎత్తిపోతల పథకంతోనే నారాయణపురం మండలానికి శాశ్వత సాగునీరు అందుతుందని సీపీఐ(ఎం) నాయకులు అన్నారు. రాచకొండ ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణపురం మండలానికి శాశ్వత సాగునీరు సాధించడమే లక్ష్యంగా సీపీఐ(ఎం) సమస్త నారాయణపురం మండల పార్టీ ఆధ్వర్యంలో 28 గ్రామాలలో 79.3 కిలోమీటర్ల పాదయాత్ర విజయవంతంగా ముగిసింది. ఆదివారం మర్రిగూడ మండలం చెర్లగూడెం–శివన్నగూడెం రిజర్వాయర్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర మూడు రోజులపాటు కొనసాగి మంగళవారం చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుంది. సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే డిమాండ్‌తో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలను చైతన్యపరుస్తూ ముందుకు సాగారు.
సాగు, తాగునీటికి శాశ్వత పరిష్కారం కావాలి
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. నారాయణపురం మండలం 63,630 ఎకరాల భౌగోళిక విస్తీర్ణంతో పాటు 44,335 మంది జనాభాను కలిగి ఉందన్నారు. మండల పరిధిలో 44,567 ఎకరాల సాగు భూమి ఉండగా, ఏడు పెద్ద చెరువులతో పాటు 69 చిన్న చెరువులు, కుంటలు ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ చెరువులు, కుంటలు భారీ వర్షాలు కురిసినప్పుడే నిండే పరిస్థితి నెలకొందని, వర్షాధారంగా వ్యవసాయం సాగుతుండడంతో రైతులు ప్రతి ఏటా సాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ నేపథ్యంలో రాచకొండ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి మండలానికి శాశ్వత సాగునీటి సౌకర్యం కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రాజెక్టు అమలుతో సాగునీటి సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు తాగునీటి అవసరాలు కూడా తీరుతాయని వారు పేర్కొన్నారు.

‘రాచకొండ ఎత్తిపోతల పథకంతోనే నారాయణపురం మండలానికి శాశ్వత సాగునీరు’
ఈ కార్యక్రమంలో పాదయాత్ర బృందం సభ్యులు సుర్కంటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నర్సిరెడ్డి, దోడ యాదిరెడ్డి, మల్లేపల్లి లలిత గుంటూరు శ్రీనివాసచారి, ఐతరాజు గాలయ్య, ఆరుట్ల రాజు, కేసాని కృష్ణ, గుండు జంగయ్య, ఉప్పలపల్లి బాలకృష్ణ, కుకుడాల మంగమ్మ, వెలిజాల సుందరయ్య, దూడ భరత్ రెడ్డి, దొంతగోని శంకరయ్య, జనగల యాదయ్య, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు దోనూరు నర్సిరెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బూరుగు కృష్ణారెడ్డి, మాటూరి బాలరాజు, పాలడుగు నాగార్జున, బండ శ్రీశైలం, సీనియర్ నాయకులు దొంతగాని పెద్దలు, పిట్ట రాములు, చింతకాయల నరసింహ, చాపల మారయ్యతో పాటు మాజీ ఎమ్మెల్సీ, మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, రైతు సంఘం రాష్ట్ర నాయకుడు పి.జంగారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, రాగిరి కిష్టయ్య, కోట రామచంద్రారెడ్డి, చౌటుప్పల్ మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, పట్టణ కార్యదర్శి గోశిక కరుణాకర్, నాయకులు దుబ్బాక జంగయ్య, అలివేలు సంజీవరెడ్డి, ఆదిమూలం నందీశ్వర్, మల్లేష్ గౌడ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రాచకొండ ఎత్తిపోతల పథకంతోనే నారాయణపురం మండలానికి శాశ్వత సాగునీరు’
Vishwambara | చిరంజీవి ‘విశ్వంభర’ ఆలస్యానికి అసలు కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల!
Madras High Court | ముఖ్యమంత్రులను విమర్శించే హక్కు పౌరులకు ఉంది.. మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
Tabu | నాగార్జున ‘కింగ్ 100’ నుంచి అదిరిపోయే అప్డేట్.. టబు పాత్ర గ్లింప్స్ వచ్చేది అప్పుడే!
మహిళలు భయం వీడి నిర్భయంగా ఫిర్యాదు చేయాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

