Liver Cleaning Foods | మన శరీరంలో అంతర్గతంగా ఉండే అవయవాల్లో అతి పెద్ద అవయవం లివర్. ఇది మన శరీరంలో సుమారుగా 500కు పైగా విధులను నిర్వహిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించడం లివర్ ముఖ్యమైన పనుల్లో ఒకటి. అయితే మనం పాటించే ఆహారపు అలవాట్లు, జీవనశైలి, తాగే పానీయాలు, పలు ఇతర కారణాల వల్ల లివర్ ఆరోగ్యం దెబ్బ తింటుంది. లివర్ పనితీరు మందగిస్తుంది. దీంతో లివర్ చేసే పనులను సక్రమంగా నిర్వహించలేకపోతుంది. దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే లివర్‌ను ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకు గాను లివర్‌ను క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి పలు ఆహార పదార్థాలు ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల లివర్ క్లీన్ అయి ఆరోగ్యంగా ఉంటుంది. ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
మనం వెల్లుల్లిని తరచూ వంటల్లో ఉపయోగిస్తుంటాం. వెల్లుల్లిలో ఆల్లిసిన్, సెలీనియం అధికంగా ఉంటాయి. ఇవి లివర్‌లో పలు రకాల ఎంజైమ్‌లు యాక్టివేట్ అయ్యేలా చేస్తాయి. ఇవి లివర్‌లో ఉండే వ్యర్థాలతోపాటు శరీరంలోని వ్యర్థాలను సులభంగా బయటకు పంపుతాయి. దీంతో లివర్ క్లీన్ అవుతుంది. రోజూ ఉదయాన్నే పరగడుపునే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటుంటే ఎంతో మేలు జరుగుతుంది. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. బ్రోకలీ, కాలిఫ్లవర్, క్యాబేజీ వంటి కూరగాయల్లో పలు సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి లివర్‌లో ఉండే వ్యర్థాలను బయటకు పంపే ఎంజైమ్‌లను తయారు చేస్తాయి. అందువల్ల ఈ కూరగాయలను తింటుంటే మేలు జరుగుతుంది. దీని వల్ల శరీరంలోని వ్యర్థాలు సైతం సులభంగా బయటకు వెళ్లిపోతాయి.
పాలకూర వంటి ఆకుకూరల్లో క్లోరోఫిల్ అనే సమ్మేళనం అధికంగా ఉంటుంది. ఇది లివర్‌తోపాటు రక్తంలో ఉండే వ్యర్థాలను బయటకు పంపించడంలో ఎంతో మెరుగ్గా పనిచేస్తుంది. టాక్సిన్ల వల్ల శరీరానికి నష్టం జరగకుండా చూస్తుంది. కనుక ఆకుకూరలను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే మేలు జరుగుతుంది. దీని వల్ల లివర్ డ్యామేజ్ అవకుండా చూసుకోవచ్చు. పసుపును కూడా మనం రోజూ వంటల్లో వేస్తుంటాం. అయితే వంటలలో వేసే పసుపు మన శరీరానికి చాలా స్వల్ప మోతాదులో లభిస్తుంది. కనుక దీన్ని నేరుగా అందేలా చూసుకోవాలి. అందుకు గాను గోరు వెచ్చని పాలలో లేదా నీటిలో కాస్త పసుపు కలిపి తాగాల్సి ఉంటుంది. ఇక పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే సమ్మేళనం శక్తివంతమైన యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది లివర్ కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తుంది. లివర్ పనితీరును మెరుగు పరుస్తుంది.
సిట్రస్ ఫలాలైన నిమ్మ, మోసంబి, నారింజ వంటి పండ్లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి లివర్‌లో ఎంజైమ్ లు యాక్టివేట్ అయ్యేలా చేస్తాయి. దీని వల్ల ఈ ఎంజైమ్‌లు లివర్ లో ఉండే వ్యర్థాలను బయటకు పంపి లివర్ క్లీన్ అయ్యేలా చేస్తాయి. దీంతోపాటు శరీరంలోని టాక్సిన్లు సైతం బయటకు పోతాయి. ఆరోగ్యంగా ఉంటారు. అలాగే వాల్ నట్స్‌ను తింటున్నా లివర్ ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. వాల్ నట్స్‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి లివర్‌ను క్లీన్ చేయడంలో ఎంతో సహాయం చేస్తాయి. వాల్ నట్స్‌లో ఉండే ఆర్జైనైన్, గ్లూటాథియోన్ అనే సమ్మేళనాలు లివర్ కణాలను రక్షిస్తాయి. దీంతో లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. రోజూ 2 కప్పుల గ్రీన్ టీని సేవిస్తున్నా కూడా లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. గ్రీన్ టీలో కాటెకిన్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి లివర్ కణాలను రక్షిస్తాయి. లివర్ శుభ్రం అయ్యేలా చేస్తాయి. కనుక గ్రీన్ టీని సేవిస్తుంటే ఉపయోగం ఉంటుంది. ఇలా పలు రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల లివర్‌ను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.