Spring Onions | సాధారణంగా కూరల్లో మనం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వంటి ఆకులను వేస్తుంటాం. వీటిని వేయడం వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అంతేకాదు, ఈ ఆకులు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ఈ ఆకులతోపాటు కొందరు కూరల్లో ఉల్లికాడలను కూడా వేస్తుంటారు. వీటితో నేరుగా కూరలు, పచ్చళ్లు కూడా చేస్తుంటారు. చారు వంటి వంటల్లో ఉల్లికాడలను ఎక్కువగా వేస్తారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వంటలకు చక్కని రుచి, వాసనను అందిస్తాయి. అయితే ఉల్లికాడలు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఉల్లికాడలను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు. పలు రకాల వ్యాధులను నయం చేసేందుకు ఇవి అద్భుతంగా పనిచేస్తాయి.
ఉల్లికాడల్లో అనేక పోషకాలు ఉంటాయి. వీటిల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల శరీరం ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ముఖ్యంగా సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలాగే విటమిన్ సి వల్ల శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది చర్మాన్ని సురక్షితంగా ఉంచుతుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గేలా చేస్తుంది. దీంతో చర్మంపై ఉండే ముడతలు, మచ్చలు తొలగిపోతాయి. యవ్వనంగా కనిపిస్తారు. చర్మం కాంతివంతంగా మారి ఆరోగ్యంగా ఉంటుంది. ఉల్లికాడల్లో విటమిన్ కె అధికంగా ఉంటుంది. ఇది గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది. దీంతో తీవ్ర రక్త స్రావం జరగకుండా ఆపవచ్చు. విటమిన్ కె వల్ల ఎముకలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
ఉల్లికాడల్లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటిల్లో ఫ్లేవనాయిడ్స్, సల్ఫర్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలోని వాపులు తగ్గిపోతాయి. ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ఉల్లికాడల్లో ఆల్లియం అనే సమ్మేళనం అధికంగా ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. దీని వల్ల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. ఉల్లికాడలను తింటే అనేక యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ కారకాలుగా కూడా పనిచేస్తాయి. వీటి వల్ల కొలెస్ట్రాల్, బీపీ తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఉల్లికాడల్లో అధికంగా ఉండే ఫైబర్ కారణంగా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అజీర్తి తగ్గుతుంది. మలబద్దకం నుంచి బయట పడవచ్చు. ఉల్లికాడలను తింటే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తుంది.
ఉల్లికాడల్లో అధికంగా ఉండే విటమిన్లు కె, సి కారణంగా ఎముకలు నిర్మాణమవుతాయి. ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. ఎముకల సాంద్రత పెరుగుతుంది. దీని వల్ల వృద్ధాప్యంలో ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. ఉల్లికాడల్లో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు, ఆల్లియం అనే సమ్మేళనం కారణంగా షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. ఇవి ఇన్సులిన్‌లా పనిచేస్తాయి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గి డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఉల్లికాడల్లో విటమిన్ ఎ తోపాటు లుటీన్, జియాజాంతిన్ అనే కెరోటినాయిడ్స్ ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగు పరుస్తాయి. వయస్సు మీద పడడం కారణంగా కళ్లలో వచ్చే శుక్లాలు రాకుండా అడ్డుకుంటాయి. ఉల్లికాడల్లో అధికంగా ఉండే విటమిన్లు సి, ఎ కారణంగా శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. దీంతో ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఇలా ఉల్లికాడలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.