Soaked Walnuts | నట్స్ పేరు చెప్పగానే మనకు ముందుగా బాదంపప్పు, జీడిపప్పు గుర్తుకు వస్తాయి. వీటిని మనం తరచూ ఉపయోగిస్తుంటాం. మసాలా వంటకాల్లో వీటి పేస్ట్‌ను వేస్తుంటారు. దీంతో వంటకాలకు చక్కని రుచి వస్తుంది. అలాగే తీపి వంటకాల్లోనూ ఈ నట్స్‌ను వేస్తుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని నేరుగా తినేందుకు కూడా చాలా మంది ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే నట్స్ అంటే కేవలం ఇవి మాత్రమే కాదు. ఇంకా అనేక నట్స్ ఉన్నాయి. అవన్నీ మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందించేవే. వాటిల్లో వాల్ నట్స్ కూడా ఒకటి. వాల్ నట్స్ చూసేందుకు అంత ఆకర్షణీయంగా ఉండవు. అలాగే ఇవి రుచిగా కూడా ఉండవు. కనుక వాల్ నట్స్‌ను తినేందుకు చాలా మంది ఆసక్తిని చూపించరు. అయితే వాల్ నట్స్‌ను రోజూ నీటిలో నానబెట్టి తింటే ఎంతో మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ నట్స్‌ను తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వారు అంటున్నారు.
వాల్ నట్స్‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మెదడు పనితీరును పెంచుతాయి. రోజూ ఉదయం నీటిలో నానబెట్టిన వాల్ నట్స్‌ను తింటుంటే రోజంతా మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. చురుగ్గా ఉంటారు. బద్దకం అనేది ఉండదు. వాల్ నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇతర పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను తగ్గిస్తాయి. దీంతో రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. హృదయ సంబంధ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.
నీటిలో నానబెట్టిన వాల్ నట్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ప్రోటీన్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి ఆకలిని నియంత్రిస్తాయి. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా చేస్తాయి. కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది అధిక బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. బరువు తగ్గాలని చూస్తున్నవారు వాల్ నట్స్‌ను కచ్చితంగా తమ రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ నట్స్‌ను రోజూ తింటుంటే బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. వాల్ నట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌పై పోరాటం చేస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా కణాలు డ్యామేజ్ అవకుండా సురక్షితంగా ఉంటాయి. దీని వల్ల వృద్ధాప్య ఛాయలు రాకుండా చూసుకోవచ్చు. ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు.
వాల్ నట్స్‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి మూడ్‌ను నియంత్రిస్తాయి. గుప్పెడు వాల్ నట్స్‌ను తింటే ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ తగ్గుతాయి. దీంతో మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. వాల్ నట్స్‌లో జింక్, సెలీనియం, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. దీంతో ఇన్ఫెక్షన్లు, రోగాలు తగ్గుతాయి. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. ఇలా వాల్ నట్స్‌ను నానబెట్టి తింటుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.