Snake Gourd | పొట్ల కాయలు అంటే చాలా మందికి అంతగా నచ్చవు. వీటిని తినేందుకు అధిక శాతం మంది విముఖతను వ్యక్తం చేస్తుంటారు. ఇవి ఉండే కలర్, వీటి షేప్, టేస్ట్ వల్ల ఈ కాయలను తినేందుకు చాలా మంది అంతగా ఆసక్తిని చూపించరు. కానీ పొట్లకాయలను తినకపోతే అనేక లాభాలను కోల్పోయినట్లే అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పొట్లకాయలను కేవలం ఇండియాలోనే కాక పలు ఆసియా దేశాల వాసులు కూడా తింటారు. పొట్లకాయలతో చాలా మంది కూర చేస్తుంటారు. పెరుగు లేదా పాలతో కలిపి పొట్లకాయలను వండి తింటారు. ఈ కూర ఎంతో రుచిగా ఉంటుంది. పొట్లకాయలను జ్యూస్‌లా చేసి రోజూ ఉదయం ఒక కప్పు మోతాదులో తాగుతుంటే అనేక లాభాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పొట్లకాయల్లో క్యాలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఈ కాయలు ఎంతో మేలు చేస్తాయి. ఈ కాయలతో జ్యూస్ తయారు చేసి రోజూ తాగుతుంటే శరీరంలోని కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. పొట్లకాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. షుగర్ లెవల్స్‌ను నియంత్రిస్తుంది. పొట్లకాయల్లో ఉండే ఫైబర్ కారణంగా ఈ జ్యూస్‌ను తాగితే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. బరువును నియంత్రణలో ఉంచుతుంది. పొట్లకాయల్లో మన శరీరానికి కావల్సిన అనేక విటమిన్లు, మినరల్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి.
పొట్లకాయల్లో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది. ఈ కాయల్లో ఉండే విటమిన్ సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను బలంగా మారుస్తుంది. చర్మాన్ని సంరక్షించే కొల్లాజెన్‌ను అధికంగా ఉత్పత్తి చేస్తుంది. పొట్లకాయల్లో అనేక బి విటమిన్లు ఉంటాయి. థయామిన్, రైబోఫ్లేవిన్, నియాసిన్ వంటివి ఈ కాయల్లో అధికంగా ఉంటాయి. ఇవి శరీర మెటబాలిజంను పెంచుతాయి. జీవక్రియలు సరిగ్గా నిర్వహించబడేలా చూస్తాయి. పొట్లకాయలను తినడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయని సైంటిస్టుల అధ్యయనాల్లో తేలింది. ఈ కాయల్లో హైపో గ్లైసీమిక్ గుణాలు ఉంటాయి. ఇవి షుగర్‌కు వ్యతిరేకంగా పనిచేస్తాయి. కనుక డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతాయి.
పొట్లకాయల్లో అనేక విటమిన్లు, బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. పొట్లకాయల్లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్ నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. ఈ కాయల్లో ఉండే డైయురెటిక్ గుణాలు శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్లను బయటకు పంపుతాయి. దీంతో శరీరం డిటాక్స్ అవుతుంది. పొట్లకాయల్లో హెపాటో ప్రొటెక్టివ్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల ఈ కాయల జ్యూస్‌ను రోజూ తాగుతుంటే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. లివర్‌లోని వ్యర్థాలు బయటకు పోయి లివర్ క్లీన్ అవుతుంది. ఇలా పొట్లకాయలను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటున్నా లేదా వాటి జ్యూస్‌ను రోజూ తాగుతున్నా అనేక లాభాలను పొందవచ్చు.