Purple Cabbage | క్యాబేజీని మనం తరచూ వండుకుని తింటుంటాం. క్యాబేజీ, కాలిఫ్లవర్ ఇవి ఒకే వర్గానికి చెందిన కూరగాయలు. థైరాయిడ్ సమస్య ఉన్నవారు వీటిని తినకూడదు. కానీ ఇతరులు ఎవరైనా సరే క్యాబేజీని నిరభ్యంతరంగా తినవచ్చు. క్యాబేజీలో మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాలు ఉంటాయి. అయితే మనకు క్యాబేజీ పలు రకాల రంగుల్లో లభిస్తుంది. మనం ఎక్కువగా ఆకుపచ్చ రంగు క్యాబేజీని తింటుంటాం. కానీ పర్పుల్ రంగు క్యాబేజీ ఇంకా శ్రేష్టమైనదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పర్పుల్ రంగు క్యాబేజీని తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక పోషకాలు లభించడంతోపాటు ఆరోగ్యంగా ఉంటారని, వ్యాధులు దరి చేరకుండా ఉంటాయని చెబుతున్నారు.
పర్పుల్ కలర్లో ఉండే క్యాబేజీలో అనేక విటమిన్లు ఉంటాయి. ఈ క్యాబేజీలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు చర్మాన్ని సంరక్షిస్తుంది. శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తికి విటమిన్ సి సహాయ పడుతుంది. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కాంతివంతంగా మారి మెరుస్తుంది. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు పోతాయి. పర్పుల్ కలర్ క్యాబేజీలో విటమిన్ కె అధికంగా ఉంటుంది. ఇది ఎముకలకు బలాన్నిస్తుంది. అలాగే గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది. దీంతో తీవ్ర రక్త స్రావం అవకుండా సురక్షితంగా ఉండవచ్చు. పర్పుల్ రంగు క్యాబేజీలో పొటాషియం కూడా అధికంగానే ఉంటుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారు తరచూ ఈ క్యాబేజీని తింటుంటే బీపీని అదుపులో ఉంచుకోవచ్చు.
పర్పుల్ కలర్ క్యాబేజీలో క్యాల్షియం కూడా అధికంగానే ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. విరిగిన ఎముకలు అతుక్కుంటన్న వారు ఈ క్యాబేజీని తింటే త్వరగా ఎముకలు అతుక్కుంటాయి. ఈ క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగానే ఉంటాయి. ముఖ్యంగా ఆంథో సయనిన్స్ ఉంటాయి. అందువల్లే ఈ క్యాబేజీ పర్పుల్ రంగులో ఉంటుంది. ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ కారకాలుగా పనిచేస్తాయి. దీని వల్ల శరీరంలోని వాపులు, నొప్పులు తగ్గుతాయి. ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పర్పుల్ కలర్ క్యాబేజీని తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బీపీని తగ్గించడంతోపాటు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా అదుపులో ఉంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగు పడి హార్ట్ ఎటాక్ రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
పర్పుల్ రంగు క్యాబేజీలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఈ క్యాబేజీలో ఫైబర్ కూడా అధికంగానే ఉంటంది. ఇది జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. మలం సరిగ్గా బయటకు వచ్చేలా చేస్తుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. పర్పుల్ రంగు క్యాబేజీలో ఉండే యాంథో సయనిన్స్ శరీరంలోని వాపులను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ క్యాబేజీని తింటే బరువు నియంత్రణలో ఉంటుంది. అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. ఇన్ని లాభాలు ఉన్నాయి కనుక ఇకపై మీకు ఈ క్యాబేజీ కనిపిస్తే విడిచిపెట్టకుండా తెచ్చుకుని తినండి. అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.