Pomegranate | ఎరుపు రంగులో చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా మనకు దానిమ్మ పండ్లు కనిపిస్తాయి. ఇవి మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. కనుక దానిమ్మ పండ్లను మనం ఎప్పుడైనా తినవచ్చు. సాధారణంగా చాలా మంది కేవలం జ్వరం వచ్చినప్పుడు లేదా శస్త్ర చికిత్స జరిగినప్పుడు మాత్రమే దానిమ్మ పండ్లను తింటుంటారు. లేదా వాటి రసం తాగుతుంటారు. కానీ వాస్తవానికి ఈ పండ్లను మనం రోజూ తినాలి. అయితే ఈ పండ్లను తినడం ఇష్టం లేనివారు వీటి జ్యూస్‌ను అయినా సరే రోజూ తాగవచ్చు. రోజూ ఒక కప్పు మోతాదులో దానిమ్మ పండ్ల జ్యూస్‌ను తాగితే అనేక లాభాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రోజూ దానిమ్మ పండ్ల రసాన్ని తాగుతుంటే అనేక లాభాలు ఉంటాయని వారు అంటున్నారు.
దానిమ్మ పండ్లలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గతుంది. ఫలితంగా క్యాన్సర్, గుండె జబ్బులు వంటి తీవ్రమైన వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. దానిమ్మ పండ్ల రసాన్ని తాగుతుంటే హైబీపీ నియంత్రణలోకి వస్తుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో గుండె పనితీరు మెరుగు పడుతుంది. గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ రాకుండా ఉంటుంది. దానిమ్మ పండ్లలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలోని వాపులను తగ్గిస్తాయి. దీంతో ఆర్థరైటిస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ నుంచి విముక్తి లభిస్తుంది. అదేవిధంగా క్యాన్సర్ కణాల నాశనం అవుతాయి. క్యాన్సర్ పెరగకుండా చూసుకోవచ్చు.
దానిమ్మ పండ్ల రసాన్ని సేవించడం వల్ల జీర్ణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా విరేచనాలు తగ్గుతాయి. ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. దీంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. దానిమ్మ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. దీంతో ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం దానిమ్మ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్ క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. దీంతో పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
దానిమ్మ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. చర్మాన్ని సంరక్షిస్తాయి. వయస్సు మీద పడడం వల్ల వచ్చే వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. దీంతో చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు, కళ్ల కింద ఏర్పడే నల్లని వలయాలు తగ్గిపోతాయి. దానిమ్మ పండ్ల జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల మెదడు యాక్టివ్‌గా మారుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దీంతో వయస్సు మీద పడడం వల్ల వచ్చే అల్జీమర్స్ రాకుండా చూసుకోవచ్చు. దానిమ్మ పండ్ల రసాన్ని తాగితే శరీరం ఇన్సులిన్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ లేదా ప్రీ డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. ఇలా దానిమ్మ పండ్ల రసాన్ని రోజూ సేవించడం వల్ల అనేక అద్భుతమైన లాభాలను పొందవచ్చు.