Black Coffee | రోజూ ఉదయాన్నే చాలా మందికి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే చాలా మంది కాఫీ లేదా టీ తో తమ రోజును ప్రారంభిస్తారు. అలా చేయకపోతే వారికి మనస్కరించదు. ఇక టీ తాగేవారు చాలా మందే ఉంటారు. అలాగే కాఫీ ప్రియులు కూడా చాలా మందే ఉంటారు. అయితే రోజూ బ్లాక్ కాఫీ తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని అంటున్నారు వైద్యులు. బ్లాక్ కాఫీని నేరుగా అలాగే తాగాలి. అందులో చక్కెర కలపకూడదు. రుచి చేదుగా ఉంటుంది. అయినప్పటికీ బ్లాక్ కాఫీని రోజూ సేవించాలి. ముఖ్యంగా ఉదయం ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు బ్లాక్ కాఫీని తాగితే అనేక లాభాలను పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే బ్లాక్ కాఫీని సేవించడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్లాక్ కాఫీలో కెఫీన్ అధికంగా ఉంటుంది. ఇది ఏకాగ్రతను పెంచుతుంది. మానసికంగా అలర్ట్‌గా ఉండేలా చేస్తుంది. ఏకాగ్రత లేని వారు, దేనిపై కూడా ధ్యాస పెట్టలేకపోతున్నవారు బ్లాక్ కాఫీని తాగితే మంచిది. దీంతో ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే బ్లాక్ కాఫీని సేవించడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. కనుక బరువు తగ్గాలని చూస్తున్నవారు కచ్చితంగా బ్లాక్ కాఫీని ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.
రోజూ బ్లాక్ కాఫీని సేవించడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె జబ్బులు వచ్చే రిస్క్ తక్కువగా ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కనుక గుండె ఆరోగ్యంగా ఉండాలని అనుకునేవారు రోజూ బ్లాక్ కాఫీని సేవిస్తుండాలి. అలాగే ఈ కాఫీని తాగితే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి మన శరీరానికి హాని చేసే ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా క్యాన్సర్, గుండె పోటు వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. బ్లాక్ కాఫీని సేవిస్తే మన శరీరంలో డోపమైన్ రిలీజ్ అవుతుంది. దీంతో మూడ్ మారుతుంది. డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.
అధ్యయనాలు చెబుతున్న ప్రకారం బ్లాక్ కాఫీని రోజూ సేవించడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుతుందని తేల్చారు. బ్లాక్ కాఫీని తాగితే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దీంతో శరీరం ఇన్సులిన్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. ఫలితంగా షుగర్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. కనుక షుగర్ ఉన్నవారు రోజూ బ్లాక్ కాఫీని సేవిస్తుంటే మేలు జరుగుతుంది. అదేవిధంగా బ్లాక్ కాఫీని సేవిస్తే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. మలబద్దకం తగ్గుతుంది. సుఖ విరేచనం అవుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు సక్రమంగా ఉంటుంది. ఇలా బ్లాక్ కాఫీని రోజూ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.