Anjeer Milk | అంజీర్ పండ్లు మనకు డ్రై ఫ్రూట్స్ రూపంలో ఏ సీజన్లో అయినా సరే లభిస్తుంటాయి. అంజీర్ పండ్లను వాటి రూపం కారణంగా చాలా మంది తినేందుకు అంతగా ఇష్టపడరు. కానీ ఈ పండ్లను తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అంజీర్ డ్రై ఫ్రూట్స్‌ను నేరుగా తినలేరు. కనుక వీటిని నీటిలో నానబెట్టి తినాల్సి ఉంటుంది. అయితే ఇలా కూడా వద్దనుకునే వారు వీటిని పేస్ట్‌లా చేసి పాలలో వేసి మరిగించి తాగవచ్చు. ఇలా అంజీర్ కలిపిన పాలను తాగడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పాలు మనకు శక్తినిచ్చే సహజసిద్ధమైన డ్రింక్‌లా పనిచేస్తాయి. అంజీర్ పాలను తాగడం వల్ల అనేక రకాల వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు. అంజీర్ పాలలో అనేక పోషకాలు సైతం ఉంటాయి.
అంజీర్ పాలలో క్యాల్షియం, ఫాస్ఫరస్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి ఎముకలు, దంతాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. అంజీర్ పాలను తాగడం వల్ల ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. రోజూ ఈ పాలను సేవిస్తుంటే ఎముకల సాంద్రత పెరుగుతుంది. దీంతో వయస్సు మీద పడడం వల్ల వచ్చే ఆస్టియో పోరోసిస్, ఆర్థరైటిస్ వంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అంజీర్ పాలలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. అనేక విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఈ పాలలో లభిస్తాయి. పోషకాహార లోపంతో బాధపడుతున్నవారు ఈ పాలను తాగితే ప్రయోజనం ఉంటుంది. దీంతో పోషకాహార లోపం నుంచి బయట పడవచ్చు.
అంజీర్ పాలలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేలా చేస్తుంది. దీంతో అజీర్తి ఉండదు. మలబద్దకం నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. అంజీర్ పాలను తాగడం వల్ల రోజూ సుఖ విరేచనం అవుతుంది. టాయిలెట్లో గంటల తరబడి గడపాల్సిన అవసరం ఉండదు. పేగుల్లో మలం సులభంగా కదులుతుంది. జీర్ణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అంజీర్ పాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పాలలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్త సరఫరా మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ కంట్రోల్ అవుతుంది. హైబీపీ ఉన్నవారు అంజీర్ పాలను తాగుతుంటే ఎంతో మేలు జరుగుతుంది.
అంజీర్ పాలలో చక్కెర కలపకుండా తాగవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. పైగా ఈ పాల గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అంటే ఈ పాలను తాగితే షుగర్ లెవల్స్ పెరగవు సరికదా ఈ పాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారికి ఈ పాలు ఎంతో మేలు చేస్తాయి. షుగర్ ఉన్నవారు అంజీర్ పాలను తాగుతుంటే ఎంతో మేలు పొందవచ్చు. అధిక బరువు ఉన్నవారికి కూడా అంజీర్ పాలు మేలు చేస్తాయి. బరువు తగ్గేందుకు ఈ పాలు ఉపయోగపడతాయి. కొవ్వు తీసిన పాలలో అంజీర్‌ను వేసి మరిగించి తాగితే మంచిది. దీంతో కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆహారం తక్కువగా తీసుకుంటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. ఇలా అంజీర్‌ను పాలలో వేసి మరిగించి తాగితే అనేక లాభాలను పొందవచ్చు.