Amla Powder | చలికాలంలో ఉసిరికాయలు మనకు అధికంగా లభిస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే చాలా మంది ఈ సీజన్లో లభించే ఉసిరికాయలను తినేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. ఇవి అత్యంత పుల్లగా ఉంటాయి. కనుక వీటితో ఊరగాయలు, పచ్చళ్లు, పులిహోర వంటివి తయారు చేస్తుంటారు. అయితే వాస్తవానికి ఆయుర్వేదంలో ఉసిరికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉసిరిని రోజూ తీసుకోవడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. సాధారణ ఉసిరికాయలు మనకు కేవలం ఈ సీజన్లోనే లభిస్తాయి. కానీ ఉసిరిక పొడి మనకు మార్కెట్లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఈ క్రమంలోనే రోజూ ఒక టీస్పూన్ ఉసిరిక పొడిని తింటుంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. దీన్ని రాత్రి పూట ఒక టీస్పూన్ తేనెతో కలిపి తినవచ్చు. లేదా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి తాగవచ్చు. ఇలా తీసుకుంటే అనేక లాభాలు కలుగుతాయి.
ఉసిరిక పొడిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. దీంతో ఇన్ఫెక్షన్లు, వ్యాధులు తగ్గిపోతాయి. ముఖ్యంగా సీజనల్‌గా వచ్చే వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉసిరిక పొడిలో పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ల జాబితాకు చెందుతాయి. అందువల్ల ఉసిరిక పొడిని తింటే ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగించుకోవచ్చు. కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. ఆక్సీకరణ ఒత్తిడి, వాపులు తగ్గిపోతాయి. దీని వల్ల క్యాన్సర్, గుండె పోటు వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
ఉసిరిక పొడిని రోజూ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయని సైంటిస్టుల అధ్యయనాల్లో తేలింది. ఉసిరిక పొడిని తింటుంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి మేలు జరుగుతుంది. గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. హార్ట్ ఎటాక్ రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. ఉసిరిక పొడి శరీరానికి చలువ చేస్తుంది. కనుక దీన్ని తీసుకుంటే శరీరంలోని వేడి తగ్గిపోతుంది. గ్లూకోజ్ మెటబాలిజం మెరుగు పడుతుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఉసిరిక పొడిలో ఉండే క్రోమియం వల్ల శరీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ నియంత్రణలో ఉంటుంది.
ఉసిరిక పొడిని రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే జీర్ణ శక్తి పెరుగుతుంది. ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. శరీరంలో కొవ్వు చేరదు. మెటబాలిజం సైతం పెరుగుతుంది. దీని వల్ల కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. బరువు నియంత్రణలో ఉంటుంది. అలాగే చర్మానికి, శిరోజాలకు కూడా ఉసిరిక పొడి మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ను ఉత్పత్తి చేసేందుకు సహాయం చేస్తుంది. దీని వల్ల చర్మం సాగే గుణాన్ని పొందుతుంది. యవ్వనంగా ఉంటుంది. ముడతలు పడకుండా నిరోధించవచ్చు. చర్మం కాంతివంతంగా మారుతుంది. అలాగే జుట్టు రాలడం తగ్గుతుంది. శిరోజాలు ఒత్తుగా దృఢంగా పెరిగి ఆరోగ్యంగా ఉంటాయి. చర్మం, శిరోజాలకు అప్లై చేసే వివిధ రకాల ప్యాక్‌లలోనూ ఉసిరిక పొడిని వాడవచ్చు. ఇలా ఉసిరిక పొడి మనకు ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.