Brain Tumor | మమ్మీ.. తలనొప్పి!
పిల్లలు తరచూ తలనొప్పితో బాధపడుతున్నారా? ఫిట్స్ వస్తున్నాయా? వాంతులు చేసుకుంటున్నారా? అయితే నిర్లక్ష్యం చేయకండి. అవి బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు కావచ్చు. అందులోనూ ఐదేండ్లలోపు పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
- పిల్లల్లో బ్రెయిన్ ట్యూమర్స్
పిల్లలు తరచూ తలనొప్పితో బాధపడుతున్నారా? ఫిట్స్ వస్తున్నాయా? వాంతులు చేసుకుంటున్నారా? అయితే నిర్లక్ష్యం చేయకండి. అవి బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు కావచ్చు. అందులోనూ ఐదేండ్లలోపు పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అలా అని, తీవ్ర ఆందోళన చెందాల్సిన అవసరమూ లేదని చెబుతున్నారు వైద్యులు. సకాలంలో చికిత్స అందిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. జూన్ 8న ‘ప్రపంచ ట్యూమర్స్ డే’. ఈ నేపథ్యంలో చిన్నపిల్లల్లో బ్రెయిన్ ట్యూమర్స్, కారణాలు, రకాలు, నిర్ధారణ పద్ధతులు, ఆధునిక చికిత్సా పద్ధతులు.. తదితర అంశాలపై అవగాహన వ్యాసం.
మెదడులో అసహజమైన కణాల ఉత్పత్తినే ‘బ్రెయిన్ ట్యూమర్స్’ అంటారు. ఇవి అన్ని వయసుల వారినీ వేధిస్తాయి. ట్యూమర్స్ ఎందుకొస్తాయి? అనే ప్రశ్నకు కచ్చితమైన కారణాలు చెప్పలేం. పెద్దల విషయానికొస్తే.. సాధారణ కణాలు అసాధారణ కణాలుగా మారడం వల్ల ట్యూమర్స్ ఏర్పడే ఆస్కారం ఉంది. అదే పిల్లల్లో.. పుట్టుకతోనే మెదడులోని అసాధారణ కణాలు క్రమంగా వృద్ధి చెంది బ్రెయిన్ ట్యూమర్‌గా రూపాంతరం చెందే ఆస్కారం లేకపోలేదు. పిల్లల్లో వచ్చే బ్రెయిన్ ట్యూమర్స్ రెండు రకాలు.
క్యాన్సర్ ట్యూమర్స్– ఇవి వేగంగా వృద్ధి చెందుతాయి.
నాన్ క్యాన్సర్ ట్యూమర్స్– ఇవి నెమ్మదిగా విస్తరిస్తాయి.
ఏడాదిన్నర నుంచి పన్నెండేండ్ల లోపు పిల్లల్లో ట్యూమర్స్ కనిపించే అవకాశం ఉంది. మెదడులో వచ్చే మార్పులను బట్టి బ్రెయిన్ ట్యూమర్స్‌ను ఏడు రకాలుగా వర్గీకరిస్తారు.

ఆస్ట్రోసైటోమా ట్యూమర్స్
బ్రెయిన్ సెల్స్ నుంచి వచ్చే ట్యూమర్స్‌ను ఆస్ట్రోసైటోమా ట్యూమర్స్ అంటారు. పిల్లల్లో వచ్చేవాటిలో 80 శాతం ఇలాంటివే. ఇవి నాలుగు రకాలు.
గ్రేడ్-1
ఈ ట్యూమర్‌ను ‘పైలోసైటిక్ ఆస్ట్రోసైటోమా’ అంటారు. నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. కాకపోతే, మెదడు లోపలికి చొచ్చుకుపోదు. కానీ, మెదడును బలవంతంగా ముందుకు తోసేస్తుంది. శస్త్రచికిత్సతో పూర్తిగా తొలగించవచ్చు. ఫలితాలు సానుకూలంగానే ఉంటాయి. ఇది నాన్ క్యాన్సర్ ట్యూమర్. దీనివల్ల ఫిట్స్ వచ్చే ఆస్కారం లేదు.
గ్రేడ్-2
ఈ ట్యూమర్‌ను ‘డిఫ్యూజ్ ఆస్ట్రో సైటోమా’ అంటారు. కొంతమేర మెదడులోకి చొచ్చుకుపోతుంది. దీనివల్ల ఫిట్స్ వస్తాయి. సర్జరీతో పూర్తిగా తొలగించలేం. కీమో, రేడియేషన్ అవసరం లేదు.
గ్రేడ్-3
ఈ ట్యూమర్‌ను ‘ఎనాప్లాస్టిక్ ఆస్ట్రోసైటోమా’ అంటారు. ఇది క్యాన్సర్ ట్యూమర్. సర్జరీతో పాటు రేడియేషన్,
కీమో వంటి కాంబినేషన్ థెరపీ అవసరం.
గ్రేడ్-4
దీన్నే ‘మోస్ట్ అడ్వాన్స్డ్ మాలిగ్నెంటెడ్ టైప్ ట్యూమర్’ అంటారు. ఇది చాలా వేగంగా వృద్ధి చెందడమే కాకుండా వేగంగా మెదడు లోపలికి చొచ్చుకుపోతుంది. దీనికి శస్త్రచికిత్సతో పాటు కాంబినేషన్ థెరపీలు అవసరం కావచ్చు. ఈ దశలో చికిత్స అందినా రోగి ఎక్కువ కాలం బతకరు.
బ్రెయిన్ స్టెమ్ గ్లియోమా ట్యూమర్స్
మెదడుకు, శరీరానికి అనుసంధానం చేసే కణజాలాన్ని బ్రెయిన్ స్టెమ్ అంటారు. ఇది చాలా సున్నితమైన ప్రదేశం. బ్రెయిన్స్టెమ్పై ట్యూమర్ ఏర్పడితే మాత్రం సంక్లిష్టంగా మారుతుంది. సర్జరీ చేయడం అన్నది చాలా సంక్లిష్టమైన వ్యవహారం. ఇందులో సర్జరీ, బయాప్సీ
తరువాత రేడియేషన్ ఇస్తారు. బ్రెయిన్‌స్టెమ్ ట్యూమర్‌కు చికిత్స చేసినా పెద్దగా ఫలితాలు ఉండకపోవచ్చు.
ఎపెండైమోమా ట్యూమర్స్
మెదడు లోపల ఉన్న జఠరిక పొరలో ఉండే కణాలను ఎపెండైమోమా సెల్స్ అంటారు. వీటికి వచ్చే ట్యూమర్స్‌ను ఎపెండైమోమా ట్యూమర్స్ అంటారు. ఇవి జఠరిక లోపల ఉండటం వల్ల సీఎస్ఎఫ్ (సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్)ను అడ్డుకుని.. మెదడు లోపల ఒత్తిడి పెంచుతుంది. ఎపెండైమోమా ట్యూమర్ క్యాన్సర్‌గా మారే అవకాశాలు 5-10 శాతం మేర ఉంటాయి. ఈ క్యాన్సర్ ట్యూమర్స్‌ను తొలగించలేం. కాకపోతే, తొలిదశలోనే చికిత్స అందిస్తే మంచి
ఫలితాలు ఉంటాయి.
కొరైడ్ ఫ్లెక్సెస్ ట్యూమర్స్
ఇది కొన్నిసార్లు నాన్ క్యాన్సర్ ట్యూమర్, కొన్నిసార్లు క్యాన్సర్ ట్యూమర్ కావచ్చు. దీనిని సర్జరీ, రేడియేషన్, కీమో ద్వారా చికిత్స చేస్తారు.
డి-నెట్ ట్యూమర్స్ ‘డిస్ ఎంబ్రియోనల్ న్యూరో ఎపిథీలియల్’ ట్యూమర్. ఇది మెదడు ఉపరితలంపై వస్తుంది. తరచూ ఫిట్స్ ఇబ్బందిపెట్టే పిల్లల్లో డి-నెట్ ట్యూమర్స్‌కు అవకాశం ఉంది. సకాలంలో సర్జరీ చేయడం ద్వారా నయం చేయవచ్చు. ఇది నాన్ క్యాన్సర్ ట్యూమర్.
మెడిలో బ్లాస్టోమా
ఇది క్యాన్సర్ ట్యూమర్. పిల్లల్లో సాధారణంగా కనిపించే క్యాన్సర్ ట్యూమర్లలో ఇదే అధికం. ఇది చిన్న మెదడు ప్రాంతంలో వస్తుంది. నాలుగు నుంచి తొమ్మిదేండ్ల మగ పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. పుట్టుకతో వచ్చే ఆస్కారమూ లేకపోలేదు. ఎందుకు వస్తుందనే విషయంలో కచ్చితమైన కారణాలు లేవు. ఈ ప్రభావంతో నడుస్తూ నడుస్తూ, ఆడుతూ ఆడుతూ అకస్మాత్తుగా పడిపోతారు. ట్యూమర్ చిన్న మెదడుకు దగ్గరగా ఏర్పడటం వల్ల కిందికి జారి.. వెన్నెముకకు వ్యాపించే అవకాశాలు ఉంటాయి. సర్జరీ, రేడియేషన్, కీమో అవసరం కావచ్చు.
ఆప్టిక్ నర్వ్ గ్లయోమా
కంటి నరాల నుంచి వచ్చే ట్యూమర్‌ను ఆప్టిక్ నర్వ్ గ్లయోమా అంటారు. దీనికి సర్జరీ, రేడియేషన్ తప్పనిసరి. ఈ రుగ్మత పుట్టుకతోనూ ఉండవచ్చు. న్యూరో ఫైబ్రో మెటోసిస్ అనే జెనెటిక్ డిజార్డర్ ఉన్న పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

బ్రెయిన్ ట్యూమర్స్ లక్షణాలు
- తలనొప్పి.
- వాంతులు.
- వాంతి వచ్చినట్టు అనిపించడం.
- మంకుగా ఉండటం.
- ఇరిటేషన్.
- తరచూ ఫిట్స్.
- స్పృహ కోల్పోవడం.
- పిల్లలు తలపట్టుకుని ఏడవటం.
- చూపులో, మాటలో స్పష్టత లేకపోవడం.
- నడకలో ఇబ్బంది. కాళ్లు, చేతులు బలహీనపడటం.
- ప్రవర్తనలో అసాధారణమైన తేడాలు.
న్యూరాలజిస్ట్ సూచన మేరకు ఎంఆర్ఐ లేదా సీటీ స్కాన్ చేయించాలి. దీనివల్ల కచ్చితమైన వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. చికిత్స కూడా లభిస్తుంది.

చికిత్స విధానం
పిల్లల వయసు, ట్యూమర్ ఉన్న ప్రాంతం, ట్యూమర్ పరిమాణం, ట్యూమర్ దశ ఆధారంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. చాలా ట్యూమర్స్‌కు సర్జరీ అవసరం అవుతుంది. బయాప్సీతో పాటు వీలైనంతమేర ట్యూమర్‌ను తొలగించడం ఉత్తమం. సున్నిత ప్రాంతంలో ఉన్న ట్యూమర్‌కు రేడియేషన్ లేదా కీమో ద్వారా చికిత్స చేయాలి. ఎండోస్కోపిక్ లేదా ఎండోస్కోపిక్ అనుబంధ పద్ధతుల ద్వారా బ్రెయిన్ ట్యూమర్స్‌ను సులభంగా తొలగించవచ్చు. న్యూరో మానిటరింగ్, క్యూసా, న్యూరో నావిగేషన్ తదితర అడ్వాన్డ్స్ పరికరాలతో ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఈ మధ్య కాలంలో తలనొప్పి అంటూ వైద్యుల దగ్గరికి వస్తున్న చాలామంది పిల్లల్లో బ్రెయిన్ ట్యూమర్స్ బయటపడుతున్నాయి. పిల్లల్లో తరచూ తలనొప్పి వచ్చినా, వాంతులు చేసుకుంటున్నా, ఫిట్స్ వస్తున్నా తేలికగా తీసుకోవద్దు. వెంటనే న్యూరో సర్జన్ లేదా చిన్న పిల్లల వైద్యనిపుణులను సంప్రదించాలి. పిల్లల్లో వచ్చే బ్రెయిన్ ట్యూమర్స్‌ను సకాలంలో గుర్తించి, చికిత్స అందిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
– డాక్టర్ ఎస్. శ్రీకాంత్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ హైటెక్‌సిటీ, హైదరాబాద్
…?మహేశ్వర్‌రావు బండారి
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

