న్యూయార్క్ : అధిక రక్తపోటు నియంత్రణలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. బెర్రీస్, యాపిల్స్, పియర్స్ వంటి ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉన్న పండ్లను తినడంతో పాటు రెడ్ వైన్ తాగితే బీపీని అదుపులో ఉంచుకోవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ ఆహారంతో జీర్ణాశయ ఆరోగ్యం మెరుగువుతుందని పేర్కొంది. ఫ్లేవనాయిడ్ అధికంగా ఉన్న ఆహారంతో సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్‌కు సంబంధం ఉందని జర్నల్ హైపర్‌టెన్షన్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది.
రోజుకు ఒకటిన్నర కప్పుల బెర్రీస్ తీసుకుంటే సగటున 4.1 ఎంఎంహెచ్‌జీ వరకూ సిస్టోలిక్ బీపీ తగ్గుతుందని పరిశోధన పేర్కొంది. ఇక వారానికి 2.8 గ్లాసుల రెడ్ వైన్ తీసుకుంటే సగటున 3.7 ఎంఎంహెచ్‌జీ సిస్టోలిక్ బీపీ తగ్గుతుందని వెల్లడించింది. మన ప్రేవుల్లో ఉండే మైక్రోబయోం ఫ్లేవనాయిడ్లు చురకుగా మారి అవి కార్డియోప్రొటెక్టివ్ను సమర్ధంగా ప్రేరేపిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. రోజువారీ ఆహారంలో స్వల్ప మార్పుల ద్వారా బీపీ స్దాయిలను అదుపులో ఉంచుకోవచ్చని అధ్యయన రచయిత, ఉత్తర ఐర్లాండ్‌లోని క్వీన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎడిన్ కసిడీ వెల్లడించారు.