Knee Pain | మోకాళ్లు అరిగిపోవడం అనేది నరకప్రాయమైన సమస్య. కీళ్లలో ఉండే కార్టిలేజ్ అనే పదార్థం తగ్గిపోవడమే ఇందుకు ముఖ్య కారణం. సహజమైన కార్టిలేజ్ను తిరిగి అందించడానికి శరీరంలో వేరే భాగం నుంచి తీయడమో, మరొకరి కార్టిలేజ్ చొప్పించడమో చేస్తున్నారు. ఈ రెండూ కూడా అంత ప్రభావం చూపలేదు. పోనీ కృత్రిమంగా కార్టిలేజ్ని రూపొందిద్దామా అంటే, అదీ అంత ఉపయోగపడటం లేదు. ఈ సమస్యకు ఇప్పుడు ఓ పరిష్కారం దొరికినట్టే ఉంది.
కనెక్టికట్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు poly-L lactic acid అనే రసాయనాన్ని కీళ్లకు అందిస్తే ఉపయోగం ఉంటుందని తేల్చారు. ఈ రసాయనం తన చుట్టూ ఉండే కణాలను ఉత్తేజపరుస్తుందట. దాంతో తక్కువ శాతంలో ఉండే కార్టిలేజ్ వృద్ధి చెందే అవకాశం ఉంది. మోకాలు దెబ్బతిన్న కుందేళ్ల మీద ఈ చికిత్స మంచి ఫలితాలే ఇచ్చింది. అయితే ఇది మనుషుల మీద ఎంత వరకు పనిచేస్తుందన్నది ఇంకా రుజువు కాలేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
arthritis | ఆర్థరైటిస్ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి!
ఇవి అలవాటు చేసుకుంటే.. ఆర్తరైటిస్, కీళ్ల నొప్పులకు చెక్ పెట్టేయొచ్చు!
మలబద్ధక సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆయుర్వేద చిట్కాలు పాటించండి..!!