మలబద్ధకం అనేది ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న సమస్య. జంక్‌ఫుడ్, జీవనశైలిలో మార్పు వల్ల చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే, ఈ మలబద్ధకం సమస్యకు ఆయుర్వేదంలో మంచి చిట్కాలున్నాయట. వీటిని కచ్చితంగా పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చని ప్రముఖ ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ శ్రీనివాసాచార్యులు చెబుతున్నారు. ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.