Obesity | అర్ధరాత్రి అతిగా తింటున్నారా? అయితే ఈ సమస్యలు కొనితెచ్చుకున్నట్టే!
Obesity reasons | మనలో చాలా మందికి రాత్రి పూట ఆహారం తీసుకోవడం అంటే చాలా ఇష్టం. లేట్ లైట్‌గా ఫుడ్ తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయని, మరీ ముఖ్యంగా శరీరం బరువు పెరగడం, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Obesity reasons | ఎప్పుడు పడితే అప్పడు తినడం ఇవాల్టి రోజుల్లో ఫ్యాషన్‌గా మారింది. లేట్ నైట్ డిన్నర్లు నగరాల్లో సర్వసాధారణంగా మారాయి. అలాగే అర్ధరాత్రిళ్లలో టిఫిన్లు తినడం కూడా మనవాళ్లు అలవాటు చేసుకున్నారు. ఫలితంగా శరీరం బరువెక్కడం, ఒబేసిటీ సమస్యలను ఎదుర్కొంటున్నారు.
అర్ధరాత్రిళ్లు తినడం వల్ల శరీర సమస్యలపై హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన బృందం అధ్యయనం నిర్వహించింది. మామూలు ఫుడ్ల కన్నా రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల శరీరం బరువు పెరగడం, ఊబకాయం వచ్చే ప్రమాదం రెట్టింపు ఉంటుందని వారు గుర్తించారు. రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల బరువు పెరగడానికి గల కారణాలను వారు వివరించారు.
సిర్కాడియన్ రిథమ్‌కు భంగం
సిర్కాడియన్ రిథమ్ అనేది స్లీప్-వేక్ సైకిల్. ఇది శరీరాన్ని సాధారణ సమయాల్లో తినమని, నిద్రించమని, మేల్కోమని చెప్తుంది. క్రమశిక్షణతో కూడిన దినచర్య ఉండే వారిలో సర్కాడియన్ రిథమ్ సక్రమంగా ఉంటుంది. అలాకాకుండా దినచర్యలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సిర్కాడియన్ రిథమ్‌కు భంగం కలుగుతుంది. ఫలితంగా వివిధ సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా శరీరం బరువు పెరగడం వాటిలో ఒకటి.
అతిగా తినడం
రాత్రివేళ ఆకలిగా అనిపించగానే ఏదో ఒకటి తినేస్తుంటాం. సాధారణంగా అర్థరాత్రుళ్లలో తినే వారు ఎక్కువగా తింటారు. తద్వారా ఎక్కువ క్యాలరీలు అందుతాయి. అయితే నిద్రవేళలో ఆహారం తీసుకునే వ్యక్తులు అధిక క్యాలరీలను వినియోగిస్తారని ఒక అధ్యయనం కనుగొన్నది. ఇలా రాత్రివేళ ఎక్కువగా తినడం వల్ల కూడా త్వరగా జీర్ణం కాక శరీరం బరువు పెరిగిపోవడం, ఊబకాయానికి దారితీయడం జరుగుతుంది.
అనారోగ్యకరమైన ఆహారం
మనలో ఎంతమంది రాత్రిపూట ఆరోగ్యకరమైన స్నాక్స్ తింటున్నారు? అంటే సమాధానం లేదు. చాలా మంది రాత్రిపూట జంక్, ఫ్రైడ్, అనారోగ్యకరమైన ఆహారాన్ని తింటున్నారు. రాత్రి వేళ ఎక్కువగా ఆహారం తీసుకోవడం నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. అందునా మసాలా ఉండే ఆహారాలు, జంక్ ఫుడ్స్ ఒక పట్టానా జీర్ణమవక మనల్ని ఇబ్బంది పెడతాయి.
జీర్ణక్రియ చెదరడం
నిద్రవేళకు దగ్గరగా ఆహారం తీసుకున్నట్లయితే కడుపు నొప్పిని అనుభవించే అవకాశం ఉన్నది. నిద్రపోతున్నప్పుడు జీర్ణక్రియ ప్రక్రియ చాలా నెమ్మదిగా ఉంటుంది. దీని వలన ఆసిడ్ రిఫ్లక్స్ జరిగి నిద్రాభంగం కలుగుతుంది. కడుపులో నొప్పి, ఛాతీలో మంట, గ్యాస్ వంటి సమస్యలను ఎదుర్కొంటారు.
అలాగే, రాత్రి ఆహారపు అలవాట్లు మెటబాలిక్ సిండ్రోమ్‌ను ప్రేరేపించి ఊబకాయం ప్రమాదాన్ని పెంచుతుంది. రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేయడం, రాత్రి భోజనం తర్వాత స్నాక్స్ తినడం లేదా రెండూ చేయడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్‌తో సంబంధం ఉండి శరీరం బరువు పెరగడం, ఊబకాయం సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

