Pink Eye | వానకాలంలో భయపెట్టిస్తున్న కండ్ల కలక.. ఈ లక్షణాలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి
Pink Eye | కన్ను మనిషి శరీరంలో కీలకమైన భాగం. ఇంద్రియాలన్నిటిలోకి అత్యంత ప్రధానం. అత్యంత సున్నితమైన అవయవం కూడా. దీంతో వానకాలంలో వివిధ రకాల నేత్ర వ్యాధులు పెరిగిపోతాయి. అందులో ఒకటి కండ్ల కలక.
Pink Eye | వానకాలం కండ్ల కలక తీవ్రంగా వేధిస్తుంది. ఇది ప్రమాదకరమైన జబ్బు కాదు కానీ.. కొద్దిరోజుల పాటు చికాకుపెడుతుంది. కండ్లు ఎర్రబడతాయి. మంటగా ఉంటుంది. చూపులో స్పష్టత లోపిస్తుంది. అందులోనూ గులాబీ కండ్ల కలక (ఫోలిక్యులర్ కండ్ల కలక) కేసులు అధికం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నేత్ర పరిశుభ్రత పట్ల అప్రమత్తత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. సొంత చిట్కాలతో కోరికోరి సమస్యలు తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు.
కన్ను మనిషి శరీరంలో కీలకమైన భాగం. ఇంద్రియాలన్నిటిలోకి అత్యంత ప్రధానం. అత్యంత సున్నితమైన అవయవం కూడా. దీంతో వానకాలంలో వివిధ రకాల నేత్ర వ్యాధులు పెరిగిపోతాయి. అందులో ఒకటి కండ్ల కలక. ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనివల్ల కండ్లకు ఏమైనా ప్రమాదం ఉందా? దీనికి సంబంధించిన చికిత్స, వ్యాధి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలను ఈ వారం తెలుసుకుందాం. సాధారణంగా వర్షకాలంలో తేమ శాతం అధికంగా ఉంటుంది. వాతావరణంలోని తేమ వైరస్‌లకు ఆవాసంగా మారుతుంది. దీంతో రకరకాల సూక్ష్మక్రిములు వర్షకాలంలో వృద్ధి చెందుతాయి. ఈ వైరస్లలో ఒకటైన ఎడినోవైరస్ కండ్లపై ప్రభావం చూపుతుంది. కంట్లో తెల్లభాగాన్ని, కనురెప్పల లోపలివైపు భాగాన్ని కప్పి ఉంచే పల్చటి శ్లేష్మపొర అయిన కంజెక్టివాకు వచ్చే వాపునే సాధారణ పరిభాషలో ‘కండ్ల కలక’ అంటారు. ఇది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, వివిధ రకాల అలర్జీల వల్ల వస్తుంది.
ఎడినోవైరస్ తదితర ప్రత్యేక వైరస్ల సమూహం కారణంగా కూడా ఫోలిక్యులర్ కండ్లకలక సోకవచ్చు. అయితే, ఎడినోవైరస్ సోకినంత మాత్రాన కండ్లకలక రాదు. అందులోని కొన్ని ప్రత్యేక స్ట్రెయిన్ల వల్లనే సమస్య ఎదురు అవుతుంది. ఆ ప్రభావం వారం నుంచి పది రోజులపాటు ఉంటుంది. కాకపోతే, ఇన్ఫెక్షన్ ప్రభావం అందరిలోనూ ఒకేలా ఉండదు. ఒక్కో రోగిలో వైరస్ ఒక్కోలా రూపాంతరం చెంది, వేర్వేరు లక్షణాలను చూపిస్తుంది. ఎడినో వైరస్‌లో 51 రకాల స్ట్రెయిన్స్ ఉంటాయి. అందులో ప్రత్యేకించి 3, 4, 7వ స్ట్రెయిన్స్ వల్ల కండ్ల కలక వస్తుంది. ఈ మూడు స్ట్రెయిన్స్‌ను కలిపి ‘సిరోటైప్స్’ అంటారు.

రెండు రకాలు
ఫోలిక్యులర్ కండ్ల కలక రెండురకాలు. అందులో ఒకటి ‘ఫారింగో-కంజంక్ట్టివల్-ఫీవర్ (పీసీఎఫ్). ఇది తేలికపాటి లక్షణాలు కలిగి ఉంటుంది. జలుబు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ ఉన్న పిల్లలు, యువకులను బాగా ఇబ్బంది పెడుతుంది. ప్రస్తుతం నమోదవుతున్న కండ్ల కలక కేసుల్లో పీసీఎఫ్ కేసులే అధికం. ఈ కండ్ల కలక వస్తూ వస్తూ గొంతు నొప్పినీ వెంటతీసుకుని వస్తుంది. రెండవది ఎపిడెమిక్ కెరటో కంజంక్ట్టివైటిస్. దీని ప్రభావం తీవ్రంగా ఉండవచ్చు. నిర్లక్ష్యం చేస్తే కంటి ముందు భాగం కార్నియాను ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలిక నేత్ర సమస్యలకు దారితీస్తున్నది. కండ్ల కలక ఏ రకమైందో తెలుసుకుని అవసరమైన చికిత్స అందించాలి. సొంతవైద్యాల జోలికి వెళ్లకూడదు.
ఇవీ లక్షణాలు
- కండ్ల కింద వాపు
- కంట్లో ఎరుపు లేదా గులాబీ వర్ణం
- దురద
- కంటి నుంచి ధారాపాతంగా నీరు
- నేరుగా కాంతిని చూడలేకపోవడం
- జ్వరం
- గొంతునొప్పి
కండ్ల కలక సోకినవారు ఇతర కుటుంబ సభ్యులకు, బయటి వ్యక్తులకు దూరంగా ఉండాలి. తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. కండ్లను చేతితో తాకరాదు. వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోవద్దు. కండ్లజోడు వాడాలి. మంట నుంచి ఉపశమనానికి వైద్యుల సలహాతో అనెల్జెసిక్స్ వాడవచ్చు, చుక్కల మందులు వాడొచ్చు. కండ్లజోడు పెట్టుకోవాలి, మెత్తని, చెమ్మగా ఉన్న టవల్‌తో కంటి స్రావాన్ని శుభ్రపర్చాలి. ఇష్టానుసారం యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ వాడకూడదు. చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి.
– డా.మురళీధర్ కార్నియా కన్సల్టెంట్ ఎల్.వి.ప్రసాద్ కంటి దవాఖాన
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేస్తే మళ్లీ వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Pressure Cooker | ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నారా.. రుచి తగ్గకుండా ఉండాలంటే ఇలా చేయాలి..
Gang robs women passengers | సిగ్నల్ ట్యాంపరింగ్‌తో రైలు నిలిపి.. మహిళా ప్రయాణికుల నుంచి బంగారం దోచుకున్న ముఠా
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

