HomeHealthPregnant Women Cannot Be Assigned Tasks That May Adversely Affect Their Health Or That Of Their Child
Healthy Pregnancy Tips | కాన్పు సజావుగా జరగాలంటే.. ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!
Healthy Pregnancy Tips | కడుపులో మరో జీవం పెరుగుతున్న దశలో.. కాబోయే తల్లి తనతో పాటు, పసికందు ఆరోగ్యాన్నీ దృష్టిలో ఉంచుకోవాలి.
Healthy Pregnancy Tips | కడుపులో మరో జీవం పెరుగుతున్న దశలో.. కాబోయే తల్లి తనతో పాటు, పసికందు ఆరోగ్యాన్నీ దృష్టిలో ఉంచుకోవాలి. కాన్పు సజావుగా జరిగేందుకు శరీరానికి కొంతమేర కదలికలు అవసరమైనా, ఎక్కువ శ్రమతో కూడిన పనులకు మాత్రం దూరంగా ఉండాల్సిందే.
బరువులు మోయొద్దు అని పెద్దలు చెప్పే మాట శాస్త్రీయమే. బరువైన వస్తువులను మోయడం, అటూ ఇటూ జరపడం వల్ల నడుము, వెన్నె
ముకకు గాయం కావచ్చు. అప్పటికే జారి ఉన్న పెల్విక్ కండరాలు ఇంకాస్త దెబ్బతినవచ్చు.
ఎక్కువసేపు నిలబడే ఉండటం వల్ల కాళ్ల వాపులతో పాటు, నడుము నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మార్నింగ్ సిక్నెస్, నిస్సత్తువ ఉన్నవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
బట్టలు ఉతకడం లాంటి పనులను పూర్తిగా ఒంగిపోయి చేయకూడదు. పొట్ట మీద బరువు పడటం వల్ల, ఈ భంగిమ గర్భిణికి శ్రమ కలిగిస్తుంది. సయాటిక్ నెర్వ్ మీద ఒత్తిడి పెరుగుతుంది.
ఎత్తు ఎక్కడం, అది కూడా ఏదైనా బరువైన వస్తువును పట్టుకుని ఎక్కడం ఏమంత క్షేమం కాదు. గర్భంతో ఉన్నప్పుడు శరీర సమతుల్యత భిన్నంగా ఉంటుంది. కాబట్టి త్వరగా అదుపు తప్పే ప్రమాదం ఉంది.
ఈ సమయంలో పెంపుడు జంతువుల వ్యర్థాలు శుభ్రం చేయడం కూడా మంచిది కాదు. వాటిలోని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు దారితీసి.. కడుపులోని బిడ్డ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు.