పొట్ట కుడివైపు నొప్పికి కారణం?
నా వయసు యాభై రెండు. పొత్తిపొట్ట కుడివైపు చేయి తగిలితే చాలు.. నొప్పిగా ఉంటుంది. కొన్నిసార్లు సాధారణంగా కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ ప్రాంతమంతా గట్టిపడినట్టు ఉంటుంది. నాకు మెనోపాజ్ వచ్చి అయిదేండ్లు దాటింది. బీపీ, షుగర్ లాంటివి లేవు. ఆ నొప్పికి కారణం ఏమిటి? ఏవైనా టెస్టులు చేయించుకోవాలా?
నా వయసు యాభై రెండు. పొత్తిపొట్ట కుడివైపు చేయి తగిలితే చాలు.. నొప్పిగా ఉంటుంది. కొన్నిసార్లు సాధారణంగా కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ ప్రాంతమంతా గట్టిపడినట్టు ఉంటుంది. నాకు మెనోపాజ్ వచ్చి అయిదేండ్లు దాటింది. బీపీ, షుగర్ లాంటివి లేవు. ఆ నొప్పికి కారణం ఏమిటి? ఏవైనా టెస్టులు చేయించుకోవాలా?
– ఓ సోదరి
ఇక్కడ కొంత స్పష్టత అవసరం. ఆకలి ఎలా ఉంది? సాధారణంగానే ఉందా, పూర్తిగా మందగించిందా? రెండో విషయం, బరువు ఏమైనా తగ్గిపోయారా? ఈ రెండు లక్షణాలు కనుక ఉంటే, వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. ముట్లు ఆగిపోయి అయిదేండ్లు దాటింది కాబట్టి, ఒవేరియన్ మాస్ (అండాశయ కణుతుల్లాంటివి) ఏమైనా ఉందా అనేది పరీక్షించాలి. అందుకు, అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోవాలి. ఫలితాల్లో తేడా కనిపిస్తే కొన్ని రక్తపరీక్షలు రాస్తారు. అవీ చేయించుకోండి. ఈ సమయంలో కణుతులు ఏర్పడే అవకాశం ఉంది. ఒక వేళ కణితి ఉంటే, అది ఏ రకమన్నది రక్త పరీక్షలో తేలుతుంది. దాదాపు 75 శాతం కణుతులు క్యాన్సర్‌కు సంబంధించినవి కాకపోవచ్చు. మిగతా 25 శాతమే ప్రమాదకరం. వెంటనే మంచి గైనకాలజిస్టును సంప్రదిం చండి. ఏం భయం లేదు. (వైద్య నిపుణుల సలహా కోసం మహిళా పాఠకులు తమ సమస్యల్ని zindagi@ntnews.com కు మెయిల్ చేయవచ్చు)
– డాక్టర్ పి. బాలాంబ సీనియర్ గైనకాలజిస్ట్
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- menopause
- Ovarian mass
- pain
- post
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

