న్యూఢిల్లీ : ఆర్గానిక్ ఫుడ్ (Health Tips) గురించి ఎన్నో అంశాలు ప్రచారంలో ఉన్నాయి. ఆరోగ్యం కోసం ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడం మేలని ఊదరగొడుతుంటారు. అయితే ఎంతో ఖర్చుతో కూడిన ఆర్గానిక్ ఆహారం నిజంగా అవసరమేనా…అసలు ఇది ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుందా అనే సందేహాలు ఎంతో మందిని వెంటాడుతుంటాయి.
ఆర్గానిక్ ఆహారం కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని, అయితే శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో అవి అమాంతం ఫలితాలను అందించవని డాక్టర్ స్నేహల్ అదులె ఇన్స్టాగ్రాం పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఆర్గానిక్ ఫుడ్‌ను అందరూ భరించలేరని, ఆరోగ్యకర ఆహారంతో తక్కువ ఖర్చుతోనే ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని చెప్పారు.
ఆహారాన్ని, చేతులను పరిశుభ్రంగా వాష్ చేసుకుని నిత్యం పండ్లు, కూరగాయలు తీసుకుంటే దాదాపు అవే ఆరోగ్య ఫలితాలను పొందవచ్చని అన్నారు. ఇక ఆర్గానిక్ ఫుడ్ ప్రయోజనాలను పరిశీలిస్తే..సేంద్రీయ ఆహారంలో ఎలాంటి హానికారక రసాయనాలు ఉండవు. ఎరువులు, పురుగుమందులు వాడకపోవడం, ఆరోగ్యాన్ని దెబ్బతిసే ప్రిజర్వేటివ్స్‌ను కలపకపోవడంతో ఆర్గానిక్ ఫుడ్ శరీరానికి మేలు చేస్తుంది. ఆర్గానిక్ ఫుడ్‌తో అందివచ్చే ఆరోగ్య ప్రయోజనాలివే..
హానికారక రసాయనాలకు చెక్
యాంటీఆక్సిడెంట్స్
నో యాంటీబయాటిక్స్
కృత్రిమ రంగులు కలపరు
Read More :
Congress MLA | బీజేపీ నేత కాళ్లు మొక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. వీడియో