Okra For Cholesterol And Diabetes | బెండకాయలు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. బెండకాయల్లో మ్యూకస్ వంటి జిగురు పదార్థం ఉంటుంది. కనుక కొందరు ఈ కాయలను తినేందుకు ఇష్టపడరు. బెండకాయలతో వేపుడు, పులుసు తయారు చేసి తినవచ్చు. కొందరు టమాటాలు వేసి కూడా వండి తింటుంటారు. బెండకాయలను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీటిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది అసిడిటీ సమస్యను తగ్గిస్తుంది. బెండకాయల్లో విటమిన్ సి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. బెండకాయల్లో డైయురెటిక్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల ఈ కాయలను తింటే మూత్రాశయ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. మూత్రం ధారాళంగా వస్తుంది. మూత్రం సాఫీగా జారీ అవుతుంది.
బెండకాయలను నీటిలో వేసి మరిగించి తాగుతుంటే జ్వరం తగ్గుతుంది. శరీరంలోని వేడి పోతుంది. చల్లగా మారుతుంది. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. డయాబెటిస్ ఉన్నవారు బెండకాయల నీళ్లను తాగుతుంటే ఎంతో మేలు జరుగుతుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. బెండకాయలను కట్ చేసి ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా ఆ కాయలను నీటిలో అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం పరగడుపునే ఆ నీళ్లను తాగాలి. ఇలా రోజూ తాగితే షుగర్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. దీని వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు.
బెండకాయల్లో విటమిన్లు ఎ, సి, బి అధికంగా ఉంటాయి. ఈ కాయల్లో అధికంగా ఉండే అయోడిన్ థైరాయిడ్ ఉన్నవారికి మేలు చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగు పడుతుంది. బెండకాయలను కొందరు ఎండబెట్టి కూడా వాడుతుంటారు. ఒక బెండకాయలో 90 శాతం మేర నీరు ఉంటుంది. 6.4 శాతం పిండి పదార్థాలు, 1.9 శాతం ప్రోటీన్లు, 0.2 శాతం కొవ్వులు, 1.2 శాతం ఫైబర్, 0.7 శాతం మినరల్స్ ఉంటాయి. 100 గ్రాముల బెండకాయలను తింటే 33 క్యాలరీల శక్తి లభిస్తుంది. 66 మిల్లీగ్రాముల క్యాల్షియం, 56 మిల్లీగ్రాముల ఫాస్ఫరస్, 0.3 మిల్లీగ్రాముల ఐరన్, 52 మైక్రోగ్రాముల కెరాటిన్ అలాగే స్వల్ప మోతాదులో థయామిన్, రైబో ఫ్లేవిన్, నియాసిన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, మెగ్నిషియం, సోడియం, పొటాషియం, కాపర్, మాంగనీస్, జింక్ లభిస్తాయి. కనుక బెండకాయలను పోషకాలకు గనిగా చెప్పవచ్చు. ఈ కాయలను తినడం మిస్ చేశారంటే అనేక పోషకాలను కోల్పోయినట్లే.
బెండకాయల్లో ఉండే క్యాల్షియం ఎముకలను బలంగా మారుస్తుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. విరిగిన ఎముకలు అతుక్కుంటున్న వారు నాన్ వెజ్ తినలేకపోతే బెండకాయలను తినాలి. దీంతో క్యాల్షియం సమృద్ధిగా లభించి ఎముకలు త్వరగా నిర్మాణమవుతాయి. బెండకాయల్లో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది. వీటిల్లో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గర్భంతో ఉన్న మహిళలు బెండకాయలను తింటే ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది శిశువు ఎదుగుదలకు తోడ్పడుతుంది. బెండకాయల్లో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది. ఇలా ఈ కాయలను తింటే అనేక లాభాలను పొందవచ్చు.