న్యూఢిల్లీ : చలికాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు వంటివి వేధిస్తుంటాయి. ఈ సీజన్లో అధిక కొవ్వు, అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారం (Winter Food) తీసుకుంటే ఊబకాయ ముప్పుతో పాటు పలు ఆరోగ్య సమస్యలు వెంటాడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికాలం ఆపై పండగ సీజన్‌తో స్వీట్లు సహా ఇష్టమైన వంటకాలను అధికంగా తీసుకోవడం ద్వారా అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు ఎదురవుతాయని న్యూట్రిషన్ కన్సల్టెంట్ డాక్టర్ మేఘనా పసి పేర్కొన్నారు. ఈ కాలంలో ఇంటిలో తయారుచేసిన స్వీట్స్‌ను పరిమితంగా తీసుకుంటే మేలని చెబుతున్నారు.
ఇంట్లో తయారుచేసుకునే స్వీట్స్‌లో రిఫైన్డ్ షుగర్స్, ఆర్టిఫిషియల్‌గా జోడించే పదార్దాలు, ప్రిజర్వేటివ్‌లు ఉండకపోవడంతో ఆరోగ్యానికి హాని కలగదు. హైడ్రోజనేటెడ్ ఆయిల్స్‌ను కూడా దూరం పెట్టినట్టవుతుంది. ఇక రిఫైన్డ్ షుగర్‌కు బదులు తాజా పండ్ల రసం, డేట్స్, తేనె, బెల్లం వంటి ఇతర ఆరోగ్యకర ప్రత్యామ్నాయాలను వాడాలని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. ఓట్స్ రబ్డి, యాపిల్ ప్యాన్‌కేక్స్, లౌకి హల్వా, యాపిల్ ఖీర్, డేట్స్, నట్స్ రోల్, అంజీర్ రోల్, రాగి లడ్డు వంటి స్వీట్స్ మేలని డాక్టర్ పసి చెప్పుకొచ్చారు.
మైదాకు ప్రత్యామ్నాయంగా మిల్లెట్ ఫ్లోర్, గోధుమ పిండిని వాడాలని ఫలితంగా ఫైబర్‌తో పాటు అదనంగా ఆహారంలో విటమిన్లు, మినరల్స్‌ను జోడించవచ్చని చెబుతున్నారు. శరీరానికి అవసరమైన తక్షణ శక్తిని సమకూర్చడంతో పాటు ఆరోగ్యకర కొవ్వుల కోసం బాదం, జీడిపప్పు వంటి నట్స్ తీసుకోవాలి. పోషకాలతో కూడిన సమతులాహారాన్ని మితంగా తీసుకోవడం ద్వారా చలికాలంలో ఆరోగ్యకరంగా, రోజంతా చలాకీగా ఉండవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
Read More :
Vishwa Bharath | ఒకప్పుడు ఊబకాయంతో బాధపడ్డాడు.. ఇప్పుడు సెలబ్రెటీలకే ఫిట్నెస్ ట్రైనర్ అయ్యాడు!!