OCD Treatment | అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ)- ఒకే పనిని పదేపదే చేయించే సమస్య. మురికి వదల్లేదేమో, శుభ్రత ఇంకా రాలేదేమో, తాళం వేయలేదేమో అని భయపడుతూ అదేపనిగా తరచి చూసుకునేట్టు చేసే మనోవ్యాధి. చూసేవాళ్లకి సరదాగా ఉండవచ్చు. కానీ అనుభవించేవారికి నరకమే. జీవితాన్ని సందిగ్ధతలోకి నెట్టేస్తుంది. ఇప్పటివరకూ ఈ సమస్యకు సరైన చికిత్స లేదు. మందులంటూ ఉన్నా, వాటి వల్ల దుష్ఫలితాలే ఎక్కువ. ఇలాంటి సందర్భంలో NIH అనే సంస్థకు చెందిన పరిశోధకుల ప్రయత్నం కొత్త ఆశలు కల్పిస్తున్నది.
ఓసీడీతో బాధపడే రోగుల మెదడు పనితీరును శాస్త్రవేత్తలు వెయ్యి గంటల పాటు పరిశీలించారు. క్లినిక్‌లోనే కాకుండా, రోజువారీ పనులు చేసుకునేటప్పుడు వారి మెదడు ఎలా స్పందిస్తున్నదో రికార్డు చేశారు. ఈ సందర్భంగా చాలా కీలకమైన విషయాలు తెలిశాయనీ, వీటి ఆధారంగా తగిన చికిత్సలు రూపొందించవచ్చని చెబుతున్నారు. అంతేకాదు! ఇదే విధానంతో పార్కిన్సన్స్ లాంటి సమస్యలకు కూడా పరిష్కారం కనుగొనవచ్చని అంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
మెంతులు చేసే మేలు అంతింత కాదయా.. మధుమేహ రోగులకు లాభాలు మెండయా..!
గాడిద పాలు ఆరోగ్యానికి మంచివేనా ? వాటికి ఎందుకంత డిమాండ్ ?
శృంగారంపై ఆసక్తి తగ్గిపోయిందా.. అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి..
Dandruff | చలికాలంలో చుండ్రుతో బాధపడుతున్నారా? ఇలా చేసి చూడండి