Diet Plant @ Weight loss | ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతీ ఒక్కరూ ఏం తింటున్నారో, ఎలా జీవనశైలిని కొనసాగిస్తున్నారో అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ నేపథ్యంలో శరీరం బరువు పెరగడం ఒక సాధారణ సమస్యగా మారింది. ఫలితంగా అనేక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. మన శరీరం బరువును నియంత్రించుకోవాలనుకుంటే.. తొలుత ఆహారంపై దృష్టిపెట్టాలి. కొవ్వు పెరిగిపోవడానికి మనం తీసుకునే తప్పుడు ఆహారాలే ప్రధాన కారణంగా చెప్పుకోవాలి.
ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరం బరువు పెరుగుతుంది. క్యాలరీల్లో ఒక రకమైన ఎంప్టీ క్యాలరీ ఫుడ్స్‌లో తక్కువ పోషక విలువలు ఉండి శరీరం బరువు తగ్గడంలో సాయపడతాయి. నెగెటివ్ క్యాలరీ ఫుడ్స్‌ను ఖర్చు చేయాలంటే అదనంగా క్యాలరీలు అవసరమవుతాయి. ఇది శరీరం బరువు తగ్గడానికి సహాయపడతాయి. నెగెటివ్ క్యాలరీ ఫుడ్స్‌లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, అధిక ఫైబర్లు ఉంటాయి. కొన్ని రకాల నెగెటివ్ క్యాలరీ ఫుడ్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
టమాటాలలో ఫైబర్, సీ విటమిన్, పొటాషియంతో పాటు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల టమాటల్లో 19 కిలో క్యాలరీలు మాత్రమే ఉంటాయి. అంతేకాకుండా, టమాటల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉండి చర్మ క్యాన్సర్ నివారణలో సాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు నిత్యం తీసుకునే ఆహారంలో టమాటలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
దోసకాయలు శరీరానికి హైడ్రేషన్ అందిస్తాయి. వీటిలో కొన్ని విటమిన్లు, మినరల్స్ తోపాటు నీరు ఉంటుంది. 100 గ్రాముల దోసకాయలు 15 కిలో క్యాలరీలను అందిస్తాయి. వీటిని తినడం వల్ల క్యాలరీల వినియోగాన్ని తగ్గించి శరీరంలో హైడ్రేషన్ పెంచడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చు. మధుమేహం, ప్రేగు సిండ్రోమ్ రోగులు రక్తంలో చక్కెరను తగ్గించడానికి, ప్రేగు కదలికలను తగ్గించడానికి దోసకాయలను తప్పనిసరిగా తీసుకోవాలి.
కంటి ఆరోగ్యానికి అవసరమైన ఏ విటమిన్ క్యారెట్లో పుష్కలంగా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటి చూపు పెరుగుతుంది. అంతే కాకుండా క్యారెట్లో ఉండే నెగటివ్ క్యాలరీలు శరీరం బరువు తగ్గడానికి అనుమతిస్తాయి. సీజన్లో రోజుకు కనీసం ఒక క్యారెట్ తినేలా చూసుకోవాలి.
వేసవి సీజన్లో పుచ్చకాయ తినడం చాలా మంచిది. ఇది బరువు తగ్గించడంలో సహాయపడటమే కాకుండా హైపర్‌టెన్షన్‌ను అరికట్టి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. పుచ్చకాయ హైడ్రేటింగ్ ఫ్రూట్. 100 గ్రాముల పండులో కేవలం 30 కిలో క్యాలరీలుంటాయి. పుచ్చకాయలో విటమిన్ ఏ, బీ, సీ ఉన్నందున యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మనకు ఉపయోగపడతాయి.
రోజుకో యాపిల్ డాక్టర్ని దూరంగా ఉంచుతుంది. ఈ పండులో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్లు ఉంటాయి. వీటిని తినడం వలన ప్రేగు కదలికలు మెరుగుపడతాయి. శరీర బరువును తగ్గించుకోవాలనుకునే వారు యాపిల్‌ను నిత్యం తినడం చాలా అవసరం. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ప్రతి 100 గ్రాముల బ్రోకలీలో 34 కిలో క్యాలరీలు ఉంటాయి. బ్రోకలీని రోజూ తీసుకోవడం వల్ల విటమిన్ ఏ, కే లతోపాటు కాల్షియం, ఫాస్పరస్ మన రోజువారీ అవసరాలను తీరుస్తాయి. రక్తహీనత ఉన్నవారు బ్రోకలీని తప్పనిసరిగా తీసుకోవాలి.
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్బెర్రీలు వంటి కొన్ని మిక్స్డ్ బెర్రీలు మన ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు నిర్వహణకు గ్రేట్‌గా సాయపడుతాయి. ఒక కప్పు బెర్రీల్లో కేవలం 32 కిలో క్యాలరీలు అందిస్తాయి. అయితే, ఫ్రిజ్‌లో దాచిన వాటికంటే తాజా బెర్రీలు మంచివని గుర్తుంచుకోవాలి.
చివరి మాట
ఈ నెగటివ్ క్యాలరీ ఆహారాలు ఆరోగ్యానికి గొప్పవి. అయితే వీటిని ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఇవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఈ నెగెటివ్ క్యాలీరీ ఫుడ్స్ తీసుకుంటున్నప్పుడు ఏదైనా ఆరోగ్య పరిస్థితి తలెత్తితే డైటీషియన్ లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించాలి.