Neem | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను అడ్డుకునే శక్తి వేపకు ఉంది.. సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి..
చాలా మందిని అనారోగ్యానికి గురి చేసే వివిధ రకాల క్యాన్సర్ లలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఒకటి. ఈ క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుందని చెప్పవచ్చు. ప్రమాదకరమైన క్యాన్సర్లలో ఇది ఒకటి. అయితే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు సహజమైన పరిష్కారం చుట్టూ ప్రకృతిలో పెరిగే ఒక చెట్టులో దాగి ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
Neem | చాలా మందిని అనారోగ్యానికి గురి చేసే వివిధ రకాల క్యాన్సర్ లలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఒకటి. ఈ క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుందని చెప్పవచ్చు. ప్రమాదకరమైన క్యాన్సర్లలో ఇది ఒకటి. అయితే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు సహజమైన పరిష్కారం చుట్టూ ప్రకృతిలో పెరిగే ఒక చెట్టులో దాగి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. తాజా అధ్యయనం ప్రకారం భారతీయ సంప్రదాయ వైద్యంలో కీలకమైన వేప (Azadirachta indica) చెట్టులో ఉండే గెడునిన్ (Gedunin) అనే సమ్మేళనం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌పై ప్రభావవంతంగా పనిచేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పరిశోధనలో గెడునిన్ క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే విధంగా పనిచేస్తుందని చెబుతున్నారు. వేపను భారత్‌లో శతాబ్దాలుగా చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్లు వంటి అనేక ఆరోగ్య సమస్యలకు ఉపయోగిస్తున్నారు. ఆధునిక శాస్త్రం ఇప్పుడు ఈ సంప్రదాయ జ్ఞానాన్ని మరింతగా అధ్యయనం చేస్తోంది. ముఖ్యంగా సోనిక్ హెజ్హాగ్ (Shh) సిగ్నలింగ్ మార్గం క్యాన్సర్ పెరుగుదలలో కీలక పాత్ర పోషించే వ్యవస్థపై గెడునిన్ ఎలా ప్రభావం చూపుతుందో పరిశోధకులు విశ్లేషించారు.
క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే సమ్మేళనం..
ఈ పరిశోధన ప్రకారం గెడునిన్ క్యాన్సర్ కణాల పెరుగుదల మార్గాలను లక్ష్యంగా చేసుకుని వాటిని అడ్డుకుంటుంది. అలాగే ట్యూమర్ ఇతర భాగాలకు వ్యాపించే ప్రక్రియను తగ్గించే సామర్థ్యం కలిగి ఉండొచ్చని సూచిస్తున్నారు. మరింతగా ఇది అపోప్టోసిస్ అనే సహజ కణ మరణ ప్రక్రియను ప్రోత్సహించి, హానికర కణాలను నాశనం చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా, సంప్రదాయ కీమోథెరపీతో పోలిస్తే తక్కువ దుష్ప్రభావాలు ఉండే అవకాశముందని పరిశోధకులు భావిస్తున్నారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చికిత్స చాలా క్లిష్టమైనది. ఇది వేగంగా వ్యాపించడంతోపాటు ప్రారంభ దశలో గుర్తించడం కష్టంగా ఉంటుంది. అందువల్ల కొత్త చికిత్సా మార్గాల కోసం ప్రపంచవ్యాప్తంగా శోధనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వేపలోని సహజ సమ్మేళనాలు భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్సలో కీలక పాత్ర పోషించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇవి ఇంకా ప్రయోగశాల, ప్రీ-క్లినికల్ దశలోనే ఉన్నాయని గుర్తుంచుకోవాలి.
ఔషధ విలువలకు మారుపేరు వేప..
క్యాన్సర్‌పై ప్రభావం మాత్రమే కాకుండా, వేపకు అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇది శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది. చర్మ సమస్యలు, ముఖ్యంగా మొటిమలు, ఎగ్జిమా వంటి సమస్యలలో ఉపశమనాన్ని ఇస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడే అవకాశముందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే వేపను వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించడం సరైనది కాదు. ముఖ్యంగా క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల కోసం స్వయంగా మందులు వాడడం ప్రమాదకరం. వేప ఉత్పత్తులను ఉపయోగించే ముందు వైద్యులను సంప్రదించడం అవసరం. అధిక మోతాదులో తీసుకుంటే దుష్ప్రభావాలు కలగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేపపై జరుగుతున్న ఈ పరిశోధన ప్రకృతి అందించే ఔషధ విలువలను మరోసారి గుర్తుచేస్తోంది. సంప్రదాయ జ్ఞానం, ఆధునిక శాస్త్రం కలిసినప్పుడు కొత్త చికిత్సా మార్గాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని ఈ అధ్యయనం సూచిస్తోంది. అయితే దీనిపై పూర్తి స్థాయి నిర్ధారణకు ఇంకా మరిన్ని క్లినికల్ పరీక్షలు అవసరమని పరిశోధకులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- health tips
- Neem
RELATED ARTICLES
తాజా వార్తలు
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
Kaleshwaram Project | రిపేరెందుకు చేయలే.. మేడిగడ్డ బరాజ్‌పై కేంద్ర సాంకేతిక కమిటీ సూటి ప్రశ్నలు.. నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్
RS Praveen Kumar | రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్‌గా ఆర్పీఎఫ్..! ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం
Mrunal Thakur | కథలు నచ్చక..కాస్త విరామం..! మృణాల్ ఠాకూర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

