Apps:
Follow us on:

Monsoon | వర్షాకాలం వచ్చేసింది.. ఈ జాగ్రత్తలు మస్ట్‌గా ఫాలో అవ్వండి

1/14Monsoon |నైరుతి రుతుపవనాల ఆగమనంతో వర్షాలు మొదలవుతాయి. వాతావరణం చల్లగా మారిపోవడంతో వేడివేడిగా, కారం కారంగా మసాలాలు కుమ్మరించిన ఆహారం వైపు మనసు లాగుతుంది. వీటివల్ల ఆరోగ్యానికి ఇబ్బందులు తలెత్తుతాయి. వానకాలంలో మంచి ఆహారపు అలవాట్లతో మనల్ని మనం కాపాడుకోవాలి.
2/14వాతావరణం చల్లగా మారినా సరే, వానకాలంలో తగిన మోతాదులో నీళ్లు తాగాల్సిందే. ఈ కాలంలో వాతావరణంలో కొన్నిసార్లు తేమ ఎక్కువ అవుతుంది. దీంతో అధికంగా చెమట పడుతుంది. శరీరం నుంచి ఫ్లూయిడ్స్‌ బయటికి వెళ్లిపోతాయి. కాబట్టి, రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తప్పనిసరి.
3/14వానకాలంలో హెర్బల్‌ టీ, సూప్‌ లాంటి వేడి పానీయాలు ఎంచుకోవాలి. ఇవి శరీరాన్ని హాయిగా ఉంచుతూనే ఆరోగ్య ప్రయోజనాలనూ అందిస్తాయి. చమోమైల్‌ (ఒకరకం చేమంతి), గ్రీన్‌ టీ మొదలైన హెర్బల్‌ టీలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
4/14హెర్బల్‌ టీలు రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. కూరగాయలతో చేసిన సూపులు శరీరానికి తగినన్ని పోషకాలను అందిస్తాయి.
5/14


ఆయా రుతువుల్లో ప్రత్యేకంగా దొరికే రకరకాల సీజనల్‌ ఫ్రూట్స్‌ను ఆస్వాదించాలి. యాపిల్‌, దానిమ్మ, నారింజలో విటమిన్లు, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి.
6/14సీజనల్‌ పండ్లు రోగ నిరోధక వ్యవస్థను
 బలోపేతం చేస్తాయి. ఇన్ఫెక్షన్లతో పోరాడతాయి. మొత్తంగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పైగా, వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా భోజనానికి సహజమైన తీపిని జోడించవచ్చు.
7/14


వర్షాకాలంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి విటమిన్‌-సి ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోవాలి. నిమ్మ, నారింజ, ద్రాక్ష పండ్లలో విటమిన్‌-సి ఎక్కువ. కివీ, బ్రకోలీ కూడా మంచివే.
8/14శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిలో విటమిన్‌-సి సాయపడుతుంది. రోగ నిరోధక వ్యవస్థలో తెల్ల రక్తకణాలు ప్రధాన పాత్ర పోషిస్తాయనే సంగతి తెలిసిందే.
9/14
సిరి ధాన్యాలు, ప్రొటీన్లు, కూర గాయలు ఉన్న తేలికపాటి, సమతుల ఆహారం తీసుకుంటే మంచిది. దీంతో కడుపు భారంగా, ఆయాసంగా ఉండదు. ఎక్కువ పోషకాలను తీసుకోగలుగుతుంది. దంపుడు బియ్యం, క్వినోవా, ఓట్స్‌ లాంటివి ఫైబర్‌ను
అందిస్తాయి. నిలకడైన శక్తిని ఇస్తాయి.
10/14చికెన్‌, చేపల ద్వారా అందే ఓ మోస్తరు ప్రొటీన్లు కండరాల మరమ్మతు, పెరుగుదలలో దోహదపడతాయి. ఇక, కూరగాయలు శరీర ఆరోగ్యానికి అత్యవసరమైన విటమిన్లు, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి.
11/14యోగర్ట్‌, పులియబెట్టిన కూరగాయలు ప్రొబయోటిక్‌ పదార్థాలు. వీటిని తప్పక ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి పొట్టకు మంచి చేసే బ్యాక్టీరియాను పెంచుతాయి. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. పోషకాలు శరీరానికి అందేలా చూస్తాయి. పొట్ట ఆరోగ్యానికి హామీ ఇస్తాయి. దీంతో శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
12/14


భోజనంలో ఉల్లి, వెల్లుల్లి భాగం చేసుకోవాలి. ఇవి ఆహారానికి రుచిని ఇవ్వడంతోపాటు, పోషక విలువను పెంచుతాయి. వీటిలో సహజమైన యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీవైరల్‌ గుణాలు ఉంటాయి. ఇవి వాన కాలంలో తలెత్తే శ్వాస సమస్యల విషయంలో రోగ నిరోధక వ్యవస్థను సన్నద్ధం చేస్తాయి.
13/14వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీంతో వానకాలంలో ఆహార పదార్థాలు త్వరగా పాడైపోతాయి. కాబట్టి మిగిలిపోయిన ఆహారం, పండ్లు, కూరగాయలను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడానికి గాలి చొరబడని డబ్బాలను ఉపయోగించాలి.
14/14దీనివల్ల పదార్థాలు శుభ్రంగా ఉంటాయి. హానికరమైన బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మక్రిములు పెరగకుండా ఉంటాయి. ఇలా చినుకుల సీజన్‌లో మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు.