Headache | ప్రాణాల్ని పిండేసే పార్శ్వపునొప్పి.. పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువ!
పదేపదే వేధించే తలనొప్పుల్లో పార్శ్వపునొప్పి ప్రధానమైంది. దీనివల్ల తలలో సూదులతో పొడుస్తున్నట్టు ఉంటుంది. సాధారణంగా ఒకవైపునే బాధ ఉంటుంది. కొన్నిసార్లు రెండు వైపులా ఉండే ఆస్కారం ఉంది.
Headache | పదేపదే వేధించే తలనొప్పుల్లో పార్శ్వపునొప్పి ప్రధానమైంది. దీనివల్ల తలలో సూదులతో పొడుస్తున్నట్టు ఉంటుంది. సాధారణంగా ఒకవైపునే బాధ ఉంటుంది. కొన్నిసార్లు రెండు వైపులా ఉండే ఆస్కారం ఉంది. పార్శ్వపునొప్పి మన రోజువారీ జీవితాన్ని దుర్భరం చేస్తుంది. వికారం, వాంతి, కాంతిని, శబ్దాలను ఓర్చుకోకపోవడం ఇతర లక్షణాలు. పార్శపునొప్పి పురుషుల కంటే స్త్రీలలో ఎక్కువ. కౌమారదశలో, మలి వయసు తొలిదశలో మొదలవుతుంది. తీవ్ర ఆరోగ్య సమస్యలకు ఇదొక హెచ్చరిక కూడా.
పార్శ్వపునొప్పిని తేలిగ్గా తీసుకోలేం. సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే.. పార్శ్వపునొప్పి ఉన్నవారికి గుండె సంబంధ రుగ్మతలు వచ్చే అవకాశం ఎక్కువని అధ్యయనాల్లో తేలింది. పార్శ్వపునొప్పి జీవితాంతం వేధిస్తుంది. అయినా, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆ తీవ్రతను తగ్గించుకోవచ్చు.
కారణాలు
పార్శ్వపునొప్పికి కచ్చితమైన కారణం తెలియదు. కానీ, జన్యుపరమైన, పర్యావరణపరమైన ప్రభావాల్ని కాదనలేం. హార్మోన్లలో సమతౌల్యం లోపించడం (ముఖ్యంగా స్త్రీలలో), ఒత్తిడి, కొన్నిరకాల ఆహార పదార్థాలు, డీహైడ్రేషన్, నిద్రలేమి, వాతావరణంలో మార్పులు కూడా ఓ కారణమే.
లక్షణాలు
పార్శ్వపునొప్పితో బాధపడే రోగుల్లో.. వికారం, వాంతి వచ్చినట్టు ఉండటం, కాంతిని, శబ్దాలను ఓర్చుకోలేకపోవడం, మసకగా కనిపించడం, కండ్లు తిరగడం, అలసట, మెడ పట్టేసినట్టు అనిపించడం, ముక్కు పూడుకుపోవడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. న్యూరాలజిస్ట్ సూచన మేరకు ఎంఆర్ఐ, సీటీ స్కాన్ ద్వారా నొప్పికి కారణాలు తెలుస్తాయి. మందులు, జీవనశైలి మార్పులతో సమస్యను నియంత్రించుకోవచ్చు. తగినంత నిద్ర, వ్యాయామం, ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా అవసరం. ఆహార విధానంలో కూడా మార్పులు చేసుకోవాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

