Mango Leaves | మామిడి పండ్లు అంటే అందరికీ ఇష్టమే. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. వేసవి కాలంలోనే ఇవి మనకు అందుబాటులో ఉంటాయి. మామిడి పండ్లను తింటే అనేక పోషకాలు లభిస్తాయి. పలు వ్యాధులను నయం చేసుకోవచ్చు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే కేవలం మామిడి పండ్లే కాదు వాటి ఆకులు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. మామిడి పండ్లు కేవలం సీజన్లోనే అందుబాటులో ఉంటాయి. కానీ మామిడి ఆకులను మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు. మామిడి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగితే అనేక లాభాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఈ ఆకుల్లో అనేక బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. పలు వ్యాధులు నయం అయ్యేలా చేస్తాయి. కనుక మామిడి ఆకులను రోజూ ఉపయోగించాలని వారు చెబుతున్నారు.
మామిడి ఆకుల్లో మాంగిఫెరిన్, పాలిఫినాల్స్, టెర్పినాయిడ్స్ అనే బయో యాక్టివ్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా కూడా పనిచేస్తాయి. శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. దీని వల్ల ఆక్సీకరణ ఒత్తిడి, వాపులు తగ్గుతాయి. దీంతో ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. క్యాన్సర్, డయాబెటిస్, గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారికి ఈ ఆకులు ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆకుల్లో ఉండే మాంగిఫెరిన్, ఆంథో సయనైడిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు మెటబాలిజంను పెంచుతాయి. శరీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉపయోగించుకునేలా చేస్తాయి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది.
మామిడి ఆకుల్లో ఉండే మాంగిఫెరిన్ అనే సమ్మేళనం కారణంగా ఇది యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉండి యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. దీని వల్ల మెదడు ఆక్సీకరణ ఒత్తిడి, వాపులకు గురి కాకుండా ఉంటుంది. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం మామిడి ఆకుల నీళ్లను తాగడం వల్ల మెదడు పనితీరు మెరుగు పడుతుంది. మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. చురుగ్గా ఉంటారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. మతిమరుపు తగ్గుతుంది. మామిడి ఆకుల నీళ్లను తాగుతుంటే నాడీ సంబంధ సమస్యలు తగ్గుతాయని, అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా చూసుకోవచ్చని సైంటిస్టుల పరిశోధనల్లో తేలింది. అధిక బరువును తగ్గించేందుకు కూడా మామిడి ఆకులు ఎంతగానో పనిచేస్తాయి. ఈ ఆకులతో నీళ్లను తయారు చేసి రోజూ తాగుతుంటే శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు ఖర్చవుతాయి. కణాల్లో ఉండే కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. బరువు తగ్గాలనుకునే వారు ఈ నీళ్లను రోజూ తాగుతుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది.
మామిడి ఆకుల్లో హైపోటెన్సివ్ గుణాలు అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ ఆకుల నీళ్లను సేవిస్తుంటే బీపీ నియంత్రణలో ఉంటుంది. రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ ఆకుల్లో ఉండే క్వర్సెటిన్, మాంగిఫెరిన్ అనే సమ్మేళనాలు శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతాయి. దీని వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. మామిడి ఆకుల నీళ్లను తాగుతుంటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. దగ్గు, ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శ్వాసనాళాలు, గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే కఫం తొలగిపోతుంది. గాలి సరిగ్గా లభిస్తుంది. మామిడి ఆకుల్లో విటమిన్ ఎ, సి అధికంగా ఉంటాయి. కనుక ఈ ఆకులను పేస్ట్‌లా చేసి ముఖం లేదా తలకు పట్టించవచ్చు. దీంతో చర్మం, శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా మామిడి ఆకులు మనకు ఎంతగానో మేలు చేస్తాయి. కనుక ఈ ఆకులు కనిపిస్తే విడిచిపెట్టకుండా ఇంటికి తెచ్చుకుని ఉపయోగించండి.