Garlic | మనం వంటల్లో వాడే అనేక పదార్థాల్లో వెల్లుల్లి కూడా ఒకటి. దీనిని మనం ఎంతో కాలంగా వంటల్లో వాడుతున్నాం. దీని శాస్త్రీయనామం అల్లియం సాటివమ్. వంటల్లో వెల్లుల్లిని వాడడం వల్ల వంటలకు చక్కటి రుచి వస్తుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ వంటి సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అంతేకాకుండా వెల్లుల్లిలో అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. దీనిలో శోథ నిరోధక లక్షణాలతో పాటు యాంటీ మైక్రోబియల్ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. రోజూ వెల్లుల్లిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన మొత్తం ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. వెల్లుల్లిలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్పెక్షన్ లతో పోరాడే శక్తి పెరుగుతుంది.
రోగనిరోధక శక్తి పెరగడం వల్ల జలుబు, ఫ్లూ వంటి ఇన్పెక్షన్ ల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వెల్లుల్లి నైట్రిక్ యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది రక్తనాళాలు సడలించడానికి, యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ను నిరోధిస్తుంది. తద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తపోటు అదుపులో ఉండడం వల్ల గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. వెల్లుల్లిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో వెల్లుల్లి మనకు ఎంతో సహాయపడుతుంది. దీంతో గుండెజబ్బుల ప్రమాదం తగ్గుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా వెల్లుల్లి మనకు దోహదపడుతుంది. దీనిలో ఉండే శోథ నిరోధక లక్షణాలు వాపును, నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల లక్షణాలు తగ్గడంతో పాటు వాటి ప్రమాదం కూడా తగ్గుతుంది.
వెల్లుల్లిలో ఫ్లేవనాయిడ్స్, సెలీనియం వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ నుండి కణాలను రక్షిస్తాయి. దీని వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, నాడీ సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గుతుంది. స్త్రీలల్లో ఈస్ట్రోజన్ స్థాయిలను పెంచడంలో కూడా వెల్లుల్లి మనకు సహాయపడుతుంది. ఇది ఎముకల సాంద్రతను నిర్వహించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఎముకల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల ఋతుక్రమం ఆగిన మహిళల్లో వచ్చే ఎముకల పగుళ్లు, బోలు ఎముకల వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే క్రీడాకారులు, ఆటలు ఎక్కువగా ఆడే వారు వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది వ్యాయామం వల్ల కలిగే అలసటను తగ్గించి శారీరక ధృడత్వాన్ని, శక్తి స్థాయిలను మెరుగుపరచడంలో సహయపడుతుంది.
వెల్లుల్లిని తీసుకోవడం వల్ల శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించి శరీర ఆరోగ్యాన్ని ముఖ్యంగా కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడడంలో వెల్లుల్లి మనకు ఎంతగానో సహాయపడుతుంది. వెల్లుల్లి జీర్ణ వ్యవస్థలోని మంచి బ్యాక్టీరియాను పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీంతో జీర్ణక్రియ సాఫీగా సాగడంతో పాటు జీర్ణ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. తద్వారా శరీరం పోషకాలను ఎక్కువగా గ్రహిస్తుంది. వెల్లుల్లిలో ఉండే కొన్ని సమ్మేళనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. అలాగే వివిధ రకాల క్యాన్సర్లలో కణ మరణాన్ని కూడా వెల్లుల్లి ప్రేరేపిస్తుంది. ఇలా అనేక రకాలుగా వెల్లుల్లి మన మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుందని దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.