Health Tips | డాక్టర్ల వార్నింగ్‌తో 165 కిలోల బరువు తగ్గాడు..!
మిసిసిపికి చెందిన నికోలస్ క్రాఫ్ట్ (42) భారీకాయంతో బాధపడుతుండగా బరువు తగ్గకుంటే మూడు నుంచి ఐదేండ్లలో ప్రాణాపాయం తప్పదని వైద్యులు హెచ్చరించారు.
న్యూఢిల్లీ : ఊబకాయులు బరువు తగ్గితే (Health Tips) ఆరోగ్యంతో పాటు దీర్ఘాయువు పొందే అవకాశం అధికం. మిసిసిపికి చెందిన నికోలస్ క్రాఫ్ట్ (42) భారీకాయంతో బాధపడుతుండగా బరువు తగ్గకుంటే మూడు నుంచి ఐదేండ్లలో ప్రాణాపాయం తప్పదని వైద్యులు హెచ్చరించారు. డాక్టర్ల వార్నింగ్‌తో తొలుత 300 కిలోల బరువున్న క్రాఫ్ట్ క్రమంగా 165 కిలోలు తగ్గాడు. దీర్ఘాయువు సొంతం చేసుకోవాలనే స్ఫూర్తితోనే నికోలస్ క్రాఫ్ట్ ఈ అసాధారణ మార్పును సాధించాడు.
2019లో క్రాఫ్ట్ వెయిట్ లాస్ జర్నీ ప్రారంభం కాగా ఆహారంలో మార్పులతో తొలి నెలలోనే ఏకంగా 18 కిలోలు తగ్గాడు. తాను హైస్కూల్లో ఉండగా 136 కిలోల బరువు ఉన్నానని, డిప్రెషన్‌కు లోనై అతిగా ఆహారం తీసుకోవడంతో విపరీతంగా బరువు పెరిగానని క్రాఫ్ట్ గుర్తుచేసుకున్నారు. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, మోకాళ్ల నొప్పి, ఒళ్లు నొప్పులు సహా పలు ఆరోగ్య సమస్యలు క్రాఫ్ట్‌ను చుట్టుముట్టాయి.
2019లో వైద్యులు తనను హెచ్చరించారని, బరువు తగ్గకుంటే మూడేండ్ల నుంచి ఐదేండ్లలో మరణిస్తానని చెప్పారని తన శరీరంలో టైంబాంబు ఉందని బాంబు పేల్చారని చెప్పారు. తాను దీర్ఘకాలం జీవించాలని కోరుకోవడంతో బరువు తగ్గాలని నిర్ణయించుకుని ఆహారంలో మార్పులు చేపట్టానని, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చారు.
రోజుకు తీసుకునే ఆహారాన్ని 1200 నుంచి 1500 క్యాలరీలకు పరిమితం చేశానని తెలిపారు. బరువు తగ్గిన తర్వాత శ్వాస సమస్యలు తొలగిపోయాయని అన్నారు. బరువు తగ్గాలనుకునేవారు క్యాలరీలను తక్కువగా తీసుకోవాలని, ట్రాన్స్‌ఫ్యాట్స్ స్ధానంలో అసంతృప్త కొవ్వులను తీసుకోవాలని, ఆల్కహాల్, స్మోకింగ్‌కు దూరం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రొటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని, రోజూ వ్యాయామం, ఏడెనిమిది గంటల పాటు నిద్రించాలని చెబుతున్నారు.
Read More :
Corona Effect | ఎముకలపై కూడా..కరోనా ఎఫెక్ట్!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

