Corona Effect | ఎముకలపై కూడా..కరోనా ఎఫెక్ట్!
Corona Effect | కరోనా దుష్ప్రభావం పెల్విక్ హిప్పై కూడా ఉందని తోస (తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్) ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ఎన్.సోమశేఖర్‌రెడ్డి అన్నారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో శనివారం ఏర్పాటు చేసిన తోస - తోసకాన్ 2023 వార్షిక సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
Corona Effect | మాదాపూర్, మార్చి 11: కరోనా దుష్ప్రభావం పెల్విక్ హిప్పై కూడా ఉందని తోస (తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్) ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ఎన్.సోమశేఖర్‌రెడ్డి అన్నారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో శనివారం ఏర్పాటు చేసిన తోస – తోసకాన్ 2023 వార్షిక సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కరోనా కారణంగా కలిగే దుష్ప్రభావాల్లో కటి ఎముకలకు పెల్విక్ హిప్ సమస్య కూడా ఏర్పడుతుందని, ఆటో ఇమ్యూన్ రియాక్షన్లకు, రియాక్టివ్ ఆర్థరైటిస్‌కు కూడా దారితీస్తుందన్నారు.
దీనికి సంబంధించిన నొప్పి సాధారణంగా తొడ ముందు భాగంలో కొన్ని సార్లు మోకాలిలో కూడా ఉంటుందని పేర్కొన్నారు. దీనివల్ల రోగికి లేచి నిలబడటంలో మెట్లు ఎక్కడంలో ఇబ్బందిగా ఉంటుందని చెప్పారు. ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా 60కి పైగా స్టాల్స్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో ఆర్థోప్లాస్టీ, నాన్ యూనియన్ లాంగ్ బోన్స్, మణికట్లు, చేతి గాయాలు, పాదం, చీలమండ వంటి ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

