Brain Health : మానవ మెదడు కీలక అవయవం. వయసు మీరుతున్న కొద్దీ మెదడులో, దాని పనితీరులో మార్పులు చోటుచేసుకుంటాయి. మనం సరైన జాగ్రత్తలు పాటించకపోతే మన మెదడు పనితీరు మందగించడం, జ్ఞాపకశక్తి, ఆలోచనా శక్తి క్షీణించడంతో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబడే ప్రమాదం ముంచుకొస్తుంది.
జ్ఞాపకశక్తి మందగించడాన్ని నివారించేందుకు మెదడు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడంపై దృష్టి సారించాలి. మెదడుకు పదును పెడుతూ షార్ప్‌గా ఉంచుకునేందుకు సరైన చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. పజిల్స్ సాల్వ్ చేయడం, చెస్ వంటి వ్యూహాత్మక గేమ్స్ ఆడటం నుంచి నిత్యం చదవడం వంటివి జ్ఞాపకశక్తిని చురుకుగా ఉంచుతాయి.
బుక్ క్లబ్లో చేరడం, నలుగురితో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడం వంటివి చేస్తుండాలి. మెదడును చురుకుగా ఉంచుకోవడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుంది. నిత్యం వ్యాయామం చేయడం మెదడుకు రక్తసరఫరా పెంపొందిస్తుందని, డిమెన్షియా వంటి జ్ఞాపకశక్తి క్షీణతను నివారిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ జార్జియా పరిశోధకులు చెబుతున్నారు. ఇక మెదడు పనితీరును పెంపొందించుకోవాలంటే ఇవి పాటించాలి..
పజిల్స్, చెస్, బుక్ రీడింగ్
వ్యాయామం
బరువు తగ్గుదల
ఆరోగ్యకర ఆహారం
నిద్ర, ఒత్తిడి నియంత్రణ
నలుగురితో కలవడం
Read More :
Seed Balls | చెట్టంత మనసుతో చెట్లను పెంచే బాధ్యత భుజానికెత్తుకున్న ఆ ముగ్గురు!