సాధారణ బ్లడ్ ప్రెషర్ మానవుల వయసు, లింగనిర్థారణ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. వైద్య శాస్త్రం ప్రకారం డయాస్టోలిక్ ప్రెషర్ 95 mmHg దాటకూడదు. అలాగే సిస్టోలిక్ 140 mmHg మించకూడదు. ఇవి రెండూ చాలా తక్కువగా ఉంటే… లోబీపీ ఉన్నట్లే. ఇది మహిళల్లో… 60/100 , మగవారిలో 70/110 కంటే తక్కువగా ఉంటే లోబీపీ ఉన్నట్లే. మనకు లోబీపీ ఉందా లేదా అన్నది కొన్ని లక్షణాల ఆధారంగా తెలుసుకోవచ్చు.
కూర్చొని పైకి లేచినప్పుడు తల దిమ్ముగా అనిపిస్తుంది. కళ్లు మసకగ్గా కనపిస్తాయి. త్వరగా అలసిపోతారు. ఎక్కువ సేపు పనిచేయలేరు. తేలికగా తలనొప్పి , వికారంగా ఉంటుంది. అప్పడప్పుడు మూర్ఛ కూడా వస్తుంది. తరచూ ఇలాగ ఉంటే లోబీపీ కావచ్చు.
మగవారిలో కంటే మహిళల్లో లోబీపీ సమస్య ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువ రక్తస్రావం అయితే… అది లోబీపీకి దారి తియ్యవచ్చు. కొన్ని రకాల మందుల సైడ్ ఎఫెక్టుల వల్ల కూడా లోబీపీ వచ్చే ఛాన్స్ ఉంది.
సింపుల్ గా చెప్పాలంటే లోబీపీ ఉందంటే… బాడీలో సరిపడా రక్తం లేదని అర్థం. అందువల్ల లోబీపీ లక్షణాలు ఉన్నవారు వెంటనే ఆస్పత్రికి వెళ్లడం మంచిది. నీరు సరిపడా తాగాలి. రక్తం పడే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఎలాంటి టెన్షన్స్ ని దరిచేరనీయకండి. ప్రతిరోజూ తప్పకుండా ఎక్సర్ సైజులు చేయండి.