మోకరిల్లితే ఆరోగ్య పరంగా ఎన్ని లాభాలో తెలుసా?!
దేవుడి ముందు మోకరిల్లడం ఆస్తికులు అప్రయత్నంగా చేసేపనే. భగవంతుణ్ని ప్రార్థించడం, ఆయన ముందు అణకువగా ఉండటం, భక్తిని చాటుకోవడం లాంటివి మోకరిల్లే చేస్తుంటారు.
దేవుడి ముందు మోకరిల్లడం ఆస్తికులు అప్రయత్నంగా చేసేపనే. భగవంతుణ్ని ప్రార్థించడం, ఆయన ముందు అణకువగా ఉండటం, భక్తిని చాటుకోవడం లాంటివి మోకరిల్లే చేస్తుంటారు. అయితే, దీంతో ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
మోకరిల్లడం మోకాళ్లు, చీలమండలు (యాంకిల్స్), తొడ భాగాల్లో ఫ్లెక్సిబిలిటీ పెంచుతుంది. శరీరాన్ని సరైన భంగిమలో ఉంచడానికి దన్నుగా ఉండే కండరాలను బలోపేతం చేస్తుంది.
మోకరిల్లే ప్రక్రియలో పొట్ట కిందిభాగం, కటిభాగంలోని కండరాలుఉపయోగంలోకి వస్తాయి. అలా కాలి కండరాలు బలోపేతం అవుతాయి. శరీరానికి స్థిరత్వం చేకూరుతుంది.
మోకరిల్లడం వల్ల ఒక రకమైన విశ్రాంతి దొరుకుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. కాలక్రమంలో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కాళ్లు, పాదాలకు రక్త సరఫరా మెరుగుపడటానికి ఇది దోహదపడుతుంది. కాళ్లు, పాదాల్లో వాపు తగ్గడంలో సాయపడుతుంది.
తల కిందికి వంచి మోకరిల్లడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. గుండె ఆరోగ్యానికి అండగా ఉంటుంది.
మోకాళ్లు, కాళ్లు, వెన్ను దిగువ భాగం సాగదీస్తారు కాబట్టి, విశ్రాంతిగా అనిపిస్తుంది. ఆందోళన తగ్గుతుంది.
మోకరిల్లడం, ముందుకు వంగి నమస్కరించడం వల్ల వెన్ను దిగువ భాగంలో నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది.
కొన్ని రకాలైన మోకరిల్లే భంగిమలు ఆర్థరైటిస్ లాంటి వాటి నుంచి తలెత్తే అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. కీళ్ల ఆరోగ్యానికి అండగా నిలుస్తాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి హామీ దొరుకుతుంది.
భగవంతుడి ముందు మోకరిల్లడం అహంభావాన్ని తగ్గిస్తుంది. మెదడుకు పదును పెడుతుంది. శరీరాన్ని, ఆత్మను అనుసంధానం చేస్తుంది. అలా ఏకాగ్రతను, ఆధ్యాత్మిక తీవ్రతను పెంచుతుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

