Juices For Weight Loss | అధిక బరువు తగ్గాలంటే రోజూ వ్యాయామం చేయడం మాత్రమే కాదు, సరైన ఆహారాన్ని కూడా రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యవంతమైన డైట్‌ను పాటించడం వల్ల ఎంతటి మొండి కొవ్వును అయినా సరే సులభంగా కరిగించుకోవచ్చు. ముఖ్యంగా పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు అయినా కూడా సరైన ఆహారం వల్ల కరిగిపోతుంది. తాజా పండ్ల రసాలను రోజూ తాగుతుంటే వాటిల్లో ఉండే పోషకాలు బరువు తగ్గేందుకు సహాయం చేస్తాయి. పండ్ల రసాలను కూడా మీరు మీ డైట్ ప్లాన్‌లో చేర్చుకోవాల్సి ఉంటుంది. దీంతో మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఇక ఈ 6 రకాల జ్యూస్‌లు బరువు తగ్గేందుకు సహాయం చేస్తాయి.
మీరు వేగంగా బరువు తగ్గాలని చూస్తున్నట్లయితే క్యారెట్ జ్యూస్‌ను కచ్చితంగా డైట్లో చేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ జ్యూస్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలిగి ఉండేలా చేస్తుంది. దీంతో కొవ్వును కరిగించుకోవడం తేలికవుతుంది.
కాకరకాయ జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల లివర్ బైల్ యాసిడ్లను రిలీజ్ చేస్తుంది. దీని వల్ల కొవ్వు మెటబాలిజం పెరుగుతుంది. దీంతో కొవ్వు కరుగుతుంది. కనుక రోజూ కాకరకాయ జ్యూస్‌ను తాగుతుంటే ఫలితం ఉంటుంది.
కీరదోస జ్యూస్ శరీరాన్ని చల్ల బరిచి ఉత్సాహంగా మార్చడమే కాదు, బరువును తగ్గించడంలోనూ పనిచేస్తుంది. కీరదోస జ్యూస్‌లో కాస్త నిమ్మరసం కలిపి తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే నీటి శాతం, ఫైబర్ వల్ల సులభంగా బరువు తగ్గుతారు. కీరదోసలో నిమ్మరసంతోపాటు పుదీనా రసం కూడా కలిపి తాగితే ఇంకా ఎక్కువ ఫలితం పొందవచ్చు.
ఉసిరికాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ జ్యూస్‌ను రోజూ ఉదయం పరగడుపున తాగాల్సి ఉంటుంది. ఇది మెటబాలిజంను పెంచి జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. ఉసిరికాయ జ్యూస్‌లో కాస్త తేనె కలిపి తాగితే శక్తి కూడా లభిస్తుంది. అందువల్ల ఉసిరికాయ జ్యూస్‌ను రోజూ తాగాలి. దీంతో బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.
దానిమ్మ పండ్ల జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మెటబాలిజంను పెంచి బరువు తగ్గేందుకు సహాయం చేస్తాయి. ఈ జ్యూస్‌ను తాగితే ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది. దీంతో తక్కువ ఆహారం తింటారు. ఫలితంగా బరువు తగ్డడం తేలికవుతుంది.
ఇందులో క్యాలరీలు తక్కువగా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ జ్యూస్‌లో ఆర్గైనైన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఒక అమైనో యాసిడ్. ఇది కొవ్వును కరిగించేందుకు సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. పుచ్చకాయల్లో ఉండే ఫైబర్ మిమ్మల్ని ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా చేస్తుంది.
ఇలా ఈ జ్యూస్‌లలో కనీసం ఏ రెండు జ్యూస్‌లను అయినా సరే రోజూ తాగేలా డైట్ ప్లాన్ చేసుకోవాలి. దీంతో బరువును సునాయాసంగా తగ్గించుకోవచ్చు. అధిక బరువు తగ్గాలని చూస్తున్న వారికి ఈ జ్యూస్‌లు ఎంతగానో మేలు చేస్తాయి.