జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌కు మిగిలిన టీకాలకు తేడా ఏంటి?
johnson and johnson vaccine | భారత్‌లోకి మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది. కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్ఫుత్నిక్ వీ టీకాలు అందుబాటులోకి వచ్చేశాయి. కరోనా వ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో త్వరలోనే మరో టీకా అందుబాటులోకి రాబోతోంది.

johnson and johnson vaccine | భారత్‌లోకి మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది. కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్ఫుత్నిక్ వీ టీకాలు అందుబాటులోకి వచ్చేశాయి. కరోనా వ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో త్వరలోనే మరో టీకా అందుబాటులోకి రాబోతోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ఫార్మా సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ ( జే & జే ) అభివృద్ధి చేసిన కరోనా టీకాకు అత్యవసర వినియోగం కింద భారత్ అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందుబాటులో ఉన్న టీకాలకు.. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ మధ్య గల వ్యత్యాసాన్ని ఒకసారి చూద్దాం..

- ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఏవైనా రెండు డోసులు తీసుకోవాల్సినవే. కానీ జే & జే వ్యాక్సిన్‌ను ఒక్క డోస్ తీసుకుంటే సరిపోతుంది.
- ఈ వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైనదని, 85 శాతం సామర్థ్యంతో పనిచేస్తుందని అమెరికా, దక్షిణాఫ్రికా దేశాల్లో జరిగిన పరిశోధనల్లో తేలింది.
- టీకా వేసుకున్న 14 రోజుల్లో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి.
- ఈ టీకాను కోల్డ్ ప్లేస్‌లో ఉంచాల్సిన అవసరం లేదు. ఫ్రిజ్‌లో ఉంచినా కూడా మూడు నెలల పాటు ఈ వ్యాక్సిన్ నిల్వ ఉంటుంది. కాబట్టి కోల్డ్ స్టోరేజీ సదుపాయం లేని మారుమూల ప్రాంతాలకు కూడా సులభంగా ఈ జాన్సన్ అండ్ జాన్సన్ టీకాను తీసుకెళ్లవచ్చు.
- ఫైజర్, మోడెర్నా టీకాల తరహాలో ఈ వ్యాక్సిన్ కోసం ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీని వాడలేదు. కోవిషీల్డ్ తరహాలో కరోనా వైరస్ జన్యువుల్లోని స్పైక్ ప్రోటీన్‌ను ఎడినో వైరస్‌తో సమ్మిళితం చేసి ఈ వ్యాక్సిన్‌ను తయారు చేశారు. కాబట్టి ఇది శరీరంలోకి ప్రవేశించగానే రోగ నిరోధక వ్యవస్థ ప్రతిస్పందించి స్పైక్ ప్రోటీన్‌పై పోరాడేందుకు సిద్ధమవుతుంది.
అమెరికాలో ఈ వ్యాక్సిన్ వినియోగం మొదలు పెట్టిన కొత్తలో.. టీకా వేసుకున్న వారిలో రక్తం గడ్డకట్టిందన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో అమెరికాలో కొన్నాళ్లు టీకాను నిలిపివేశారు. కానీ చాలా తక్కువమందిలో ఈ లక్షణాలు కనిపించినట్లు వెల్లడి కావడంతో తిరిగి ఈ వ్యాక్సిన్‌ను వేస్తున్నారు. ఈ టీకాపై ఎలాంటి భయాందోళనలు అక్కర్లేదని అమెరికా ప్రభుత్వం చెబుతోంది.

J & J Vaccine డెల్టా వేరియంట్‌ను అడ్డుకుంటుందా?
జే &జే వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా డెల్టా వేరియంట్ సోకినా కూడా ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఉండదని దక్షిణాఫ్రికాలో నిర్వహించిన సిస్నోక్ సర్వేలో వెల్లడైంది. డెల్టాతో పాటు బీటా వేరియంట్‌పై కూడా ఈ వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తుందని తేలింది. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి డెల్టా వేరియంట్ సోకితే ఆస్పత్రిలో చేరే అవకాశం 71 శాతం వరకు ఉండదని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ లిండా గెయిల్ వెల్లడించారు. అదే బీటా వేరియంట్ సోకితే 67 శాతం వరకు ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం రాదని పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
కరోనాలా భయపెట్టిన అంటువ్యాధులు ఇవే.. వాటికి ఎలా చెక్ పెట్టారో తెలుసా?
థర్డ్ వేవ్ పిల్లలపైనే ప్రభావం చూపుతుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
అప్పట్లో ప్లేగు.. నిన్న కరోనా.. ఇలాంటివి మరిన్ని వస్తాయా?
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

