HomeHealthIs Your Buying Fresh Mutton Or Not Find With Simple Tips
Fresh Mutton | ఈ ఆదివారం మటన్ తెచ్చుకుంటున్నారా? మీరు కొనే మాంసం తాజాదేనా.. కాదా? ఇలా గుర్తించండి!
చాలామంది బోన్‌లెస్ మటన్ తినేందుకు ఇష్టపడుతుంటారు. నిజానికి బోన్‌లెస్ కన్నా కూడా బోన్ మటన్ రుచిగా ఉంటుంది. బోన్స్ ఉన్న మటన్‌లో పోషకాలు అధికంగా ఉంటాయి. పైగా బొక్కలు ఉన్న మటనే త్వరగా ఉడుకుతుంది.
2/5
Fresh Mutton | ఆదివారం వచ్చిందంటే చాలు చాలమంది నాన్‌వెజ్ తెచ్చుకోవడానికి ఇష్టపడుతుంటారు. చికెన్ కావాలంటే షాప్‌కి వెళ్తే చాలావరకు అప్పుడే కట్‌చేసి ఫ్రెష్‌గా ఇస్తుంటారు. కానీ మటన్ అలా కాదు. దీంతో మనం కొనే మటన్ తాజాదేనా? ఎప్పుడో కట్ చేసిన మాంసాన్ని అమ్ముతున్నారా? అనే విషయం తెలియక ఆందోళన పడుతుంటారు.
3/5
తాజాది అవునా? కాదా అనే అనుమానంతోనే చాలామంది మటన్ కొనడానికి కూడా వెనుకముందు అవుతుంటారు. కానీ అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు. కొన్ని టిప్స్ పాటించడం ద్వారా తాజా మటన్‌ను గుర్తించవచ్చు.
మటన్ తీసుకునేటప్పుడు దాని నుంచి ఎక్కువగా రక్తం లేదా నీరు కారుతున్నట్లు కనిపిస్తే దాన్ని తీసుకోకపోవడమే ఉత్తమం.
6/5
బాగా ఎరుపు రంగులో ఉంటే అది ముదిరిపోయిన మటన్ అని అర్థం చేసుకోవాలి. అందులో కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది. గులాబీ, ఎరుపు మధ్య రంగులో ఉండే మటన్ అయితేనే ఆరోగ్యానికి మంచిది.