అల్లం పొడిని ముక్కులో వేసుకుంటే కరోనా రాదా? ఇందులో నిజమెంత?

అల్లం వంటింట్లో ఉండే దివ్యౌషధం. దీన్ని రోజూ ఆహారంగా తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా అల్లంలో ఉండే జింజెరోల్ వల్ల దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలు దరి చేరవు. అందుకే పూర్వకాలం నుంచి ప్రతిరోజూ మనం తినే ఆహారంలో అల్లం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అల్లం మీద మనకు ఉన్న ఈ నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అల్లాన్ని పొడిగా చేసి.. రోజుకు రెండుసార్లు ముక్కు ద్వారా పీల్చుకుంటే కరోనా అంతమైపోతుందని ఒక వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

రోజుకు రెండుసార్లు తను అల్లం పొడిని ముక్కులో వేసుకుంటున్నానని ఓ వ్యక్తి ఆ వీడియోలో తెలిపాడు. అంతేకాదు తనకు తెలిసిన వారికి కూడా ఇలాగే అల్లం పొడి ప్యాకెట్లు ఇచ్చానని పేర్కొన్నాడు. కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న ఈ సమయంలో ఈ వీడియో తెగ వైరల్‌గా మారింది. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను నెటిజన్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఉన్నది ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ జరీర్ ఉద్వాదియా అని పేర్కొంటున్నారు. కానీ ఆ వీడియోలో చెప్పినదంతా అబద్ధమేనని ప్రముఖ న్యూస్ వెబ్సైట్ పరిశోధనలో వెల్లడైంది. ఈ వార్తలో నిజానిజాలను తెలుసుకునేందుకు డాక్టర్ జరీర్ ఉద్వాదియాను కలిసినప్పుడు.. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ఆయన కాదని తెలిసింది. ఇక ముక్కు ద్వారా అల్లం పొడిని పీల్చుకుంటే కరోనా రాదని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని లంగ్ కేర్ ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ అరవింద్ కుమార్ స్పష్టం చేశారు. అంతేకాదు అలా ముక్కులో అల్లం పొడిని వేసుకోవడం ప్రమాదమని హెచ్చరించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఒకటి కంటే ఎక్కువ బూస్టర్ డోసులు వేసుకొవచ్చా? తీసుకుంటే ఏమవుతుంది?
Omicron variant symptoms | గొంతులోనే వైరస్.. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలివే..
కరోనా గత వేరియంట్లతో ఊపిరి ఆడకపోయేది.. ఒమిక్రాన్‌లో ఈ లక్షణం ఎందుకు లేదు?
ఒమిక్రాన్ ఎందుకు వేగంగా వ్యాపిస్తోందంటే?.. మూడు కారణాలు చెప్పిన WHO శాస్త్రవేత్త
ఒమిక్రాన్ వచ్చింది మన మంచికేనా?.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- corona
- corona virus
- Covid-19
- Ginger
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

