Infertility | తండ్రి కాలేక పోతున్నారా..? మగాళ్లలో వీర్యకణాల సమస్య ఎందుకు వస్తుంది?
Infertility | సంతానలేమికి ఆడవాళ్లలోనే కాదు.. మగవాళ్లలోని సమస్యలు కూడా అంతే ప్రధాన కారణం. సంతానలేమికి 30 శాతం పురుషులే కారణం. వారిలో ఇన్ఫర్టిలిటీకి ప్రధానంగా రెండు కారణాలు. ఒకటి శుక్రకణాల సంఖ్య తక్కువగా లేదా వాటి నాణ్యత, చలనంలో సమస్యలు ఉండటం. రెండు లైంగిక కలయికలోనే ఇబ్బంది ఉండటం. స్తంభన సమస్యలు ఉండటం.
Infertility | సంతానలేమికి ఆడవాళ్లలోనే కాదు.. మగవాళ్లలోని సమస్యలు కూడా అంతే ప్రధాన కారణం. సంతానలేమికి 30 శాతం పురుషులే కారణం. వారిలో ఇన్ఫర్టిలిటీకి ప్రధానంగా రెండు కారణాలు. ఒకటి శుక్రకణాల సంఖ్య తక్కువగా లేదా వాటి నాణ్యత, చలనంలో సమస్యలు ఉండటం. రెండు లైంగిక కలయికలోనే ఇబ్బంది ఉండటం. స్తంభన సమస్యలు ఉండటం. అందుకే సంతానలేమి సమస్య ఉన్న జంట వచ్చినప్పుడు ఆడవాళ్లతోపాటు మగవాళ్ల ఆరోగ్యాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. ముందు సాధారణ ఆరోగ్య పరిస్థితిని చూడాలి. స్థూలకాయం, మధుమేహం లాంటి సమస్యలున్న వాళ్లలో లైంగిక సమస్యలకు ఆస్కారం ఉంటుంది. ఏ సమస్యలూ లేవని తేలినప్పుడు వీర్య పరీక్షలు చేస్తారు. వీర్యంలో శుక్రకణాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటారు. వీర్యకణాల సంఖ్య ఒక మిల్లీలీటర్ వీర్యానికి 16 మిలియన్లు ఉండాలి. అంతకన్నా తక్కువగా ఉంటే ఆలిగోజూ స్పెర్మియా అంటారు. అసలు వీర్యకణాలే లేకపోతే అజూస్పెర్మియా అంటారు. కొన్నిసార్లు వీర్యకణాల సంఖ్య సరైన మోతాదులో ఉన్నప్పటికీ ఫర్టిలిటీలో సమస్య ఉంటుంది. ఇందుకు కారణం వీర్యకణాల్లో నాణ్యత లోపించడం. సంఖ్య ఉంటే సరిపోదు.. వాటి నిర్మాణం, చురుకుదనం, మొబిలిటీ సరిగ్గా ఉండాలి.
వీర్యకణాల సమస్య ఎందుకు?
- వీర్యకణాల ఉత్పత్తి లేకపోవడానికి ‘నాన్ అబ్స్ట్రక్షన్ అజూస్పెర్మియా’ లేక ‘అబ్స్ట్రక్టివ్ అజూస్పెర్మియా’ గానీ కారణం అవుతాయి.
- వృషణాల్లో ఉత్పత్తయిన వీర్యకణాలు శుక్ర వాహిక ద్వారా వీర్యంలోకి చేరుతాయి. ఈ నాళంలో అడ్డంకులు ఉన్నప్పుడు వీర్యకణాలు వీర్యంలోకి చేరలేవు. దీన్ని ‘అబ్ స్ట్రక్టివ్ అజూస్పెర్మియా’ అంటారు. ఈ సమస్యను అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా గుర్తించవచ్చు.
- కొందరిలో జన్యుపరమైన సమస్యల వల్ల కూడా వీర్యకణాల ఉత్పత్తి ఉండదు.
- లైంగిక హార్మోన్ల ఉత్పత్తి యాక్టివేట్ కావాలంటే పిట్యుటరీ గ్రంథి నుంచి ఫోలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ సరిగ్గా ఉండాలి. వీటి ఉత్పత్తిలో తేడా ఉంటే లైంగిక హార్మోన్లలో సమస్య వస్తుంది. పురుషుల్లో టెస్టోస్టిరాన్ ఉత్పత్తి కుంటుపడుతుంది. అందువల్ల సంతానలేమి సమస్యకు దారితీస్తుంది. ఈ సమస్యను ‘హైపోగొనాడోట్రోపిక్ హైపోగొనాడిజమ్’ అంటారు.
- కీమోథెరపీ తీసుకున్నవాళ్లలో, వైరికోసిల్ సమస్య ఉన్నవాళ్లలో, గవదబిళ్లలు వ్యాధి వచ్చినవాళ్లలో వృషణాలు కూడా ఇన్ఫెక్ట్ కావడం వల్ల శుక్రకణాల సంఖ్య దెబ్బతింటుంది.
- 20 నుంచి 30 శాతం మందిలో కారణం తెలియకుండానే ఇన్ఫర్టిలిటీ ఉంటుంది.
పరిష్కారం?
- అబ్స్ట్రక్టివ్ అజూస్పెర్మియా ఉన్నవాళ్లకు టీసా (టీఈఎస్ఏ) లేదా పీసా (పీఈఎస్ఏ) ద్వారా నీడిల్‌ను డైరెక్ట్‌గా లోపలికి పంపించి వృషణాల నుంచి వీర్యకణాలను సేకరిస్తారు. తర్వాత అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ ద్వారా అండంతో ఫలదీకరణం చెందిస్తారు.
- పిట్యుటరీలో సమస్య వల్ల వీర్యకణాల లోపం ఉన్న వాళ్లకు మూడు నెలల పాటు హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తే వీర్యకణాల ఉత్పత్తి సాధారణ స్థితికి వస్తుంది.
- స్థూలకాయం ఉన్నవాళ్లలో కొవ్వులోని టెస్టోస్టిరాన్ ఈస్ట్రోజెన్‌గా మారుతుంది. ఈ రెండు హార్మోన్ల మధ్య నిష్పత్తి 1:50కి చేరితే.. దీన్ని ఆపడానికి మందులు ఇస్తారు. వీర్యకణాలు ఉత్పత్తి కావడానికి 72 రోజులు పడుతుంది. అందువల్ల ఈ మందులు తీసుకున్న 3 నుంచి 5 రోజుల వరకు లైంగిక కలయికలో పాల్గొనవద్దని చెబుతారు. ఆ తర్వాత వీర్యాన్ని సేకరించి పరీక్షిస్తారు. వీర్యకణాలను తీసుకుని ఐవీఎఫ్ ద్వారా సంతాన సాఫల్యం పొందవచ్చు.
నివారణ :
ఇన్ఫర్టిలిటీ సమస్యకు మారిన జీవనశైలే ప్రధాన కారణం. అందుకే జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉంటూ, మంచి ఆహారపు అలవాట్లు చేసుకోవాలి. సిగరెట్లు, ఆల్కహాల్ ముట్టుకోవద్దు. కొలెస్ట్రాల్ పెరగకుండా జాగ్రత్తపడాలి. అధిక ఒత్తిడి, తగినంత నిద్ర లేకపోవడం, అధిక వేడికి ఎక్స్పోజ్ కావడం, బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల శుక్రకణాల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. కొందరు శారీరక దారుఢ్యం కోసం స్టిరాయిడ్స్ తీసుకుంటారు. వీళ్లలో పిట్యుటరీ హార్మోన్లు దెబ్బతింటాయి. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తపడితే ఫర్టిలిటీ సమస్యలను నివారించొచ్చు. ఒకవేళ వచ్చినా ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక ఫర్టిలిటీ చికిత్సల ద్వారా సమస్యలను అధిగమించొచ్చు.
డాక్టర్ ప్రీతి రెడ్డి
సీనియర్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్
బర్త్ రైట్ రెయిన్బో హాస్పిటల్స్, హైదరాబాద్
ఫోన్: 8882 046 046, 78420 42028
www.rainbowhospital.in
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

