Apps:
Follow us on:

Eyes | కంటి చూపు తగ్గిపోతుందా? మీ డైట్‌లో ఈ ఫుడ్‌ను చేర్చుకోండి

1/10సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అని అంటారు. అంటే అన్ని అవయవాల్లో కంటే కండ్లు చాలా ముఖ్యం. కండ్లు ఉంటేనే ప్రపంచాన్ని చూడగలుగుతాం. అదే చూపు పోతే జీవితం మొత్తం అంధకారమే. అందుకే ఆ కండ్లను జాగ్రత్తగా కాపాడుకోవడం ఎంతైనా అవసరం. పలు ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా కూడా కంటి చూపును మెరుగుపరచుకోవచ్చు.
2/10బాదం పప్పులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటిచూపు మెరుగయ్యేలా చేస్తాయి. ప్రతి రోజు ఆరు బాదం గింజలను నీటిలో నానబెట్టుకొని తినడం వల్ల కంటి సమస్యలు పోతాయి.
3/10ఉసిరి కాయల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. కనుబొమ్మ లోపల ఉండే రెటీనాలో కొత్త కణాలు తయారయ్యేలా చేస్తుంది. ఒక గ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఉసిరికాయ జ్యూస్‌ను కలుపుకుని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తాగితే కంటి సమస్యలు తొలగుతాయి.
4/10విటమిన్ ఎ ఎక్కువగా ఉండే క్యారెట్స్, యాపిల్స్, పాలకూర, బీట్‌రూట్, బ్రకోలి, కోడిగుడ్డు తదితర కూరగాయలను రోజూ తీసుకుంటే దృష్టిలోపం సమస్య నుంచి బయటపడవచ్చు.
5/10ఒక కప్పు బాదాం పప్పు, సోంపు గింజలు కొద్దిగా చక్కెర తీసుకుని అన్నింటినీ కలిపి పొడి చేయాలి. ఈ పొడిని ఒక టేబుల్ స్పూన్‌ మోతాదులో తీసుకుని రాత్రిపూట నిద్రించే ముందు గోరు వెచ్చని పాలల్లో కలిపి తాగాలి. ఇలా ప్రతిరోజు తాగడం వల్ల కొన్ని రోజుల్లోనే కంటిచూపు మెరుగవుతుంది.
6/10టీవీ, కంప్యూటర్, సెల్‌ఫోన్ ఎక్కువసేపు రెప్ప వాల్చకుండా చూడకూడదు. మధ్యమధ్యలో కళ్లకు విశ్రాంతిని ఇవ్వాలి. కంటి చూపు తగ్గకుండా ఉండాలంటే కళ్లకు ఎక్కువ శ్రమ కల్పించవద్దు. బస్సుల్లో వెళ్తున్నప్పుడు పుస్తకాలు చదవడం వల్ల కూడా కంటిచూపు తగ్గుతుంది.
7/10అధిక ఒత్తిడి, అలసట వల్ల కండ్ల కింద వాచినట్లు అవుతుంది. అది పోవాలంటే.. వాడిన గ్రీన్ టీ బ్యాగులను చల్లటి నీటిలో ముంచి కంటి కింద వాపు ప్రాంతంలో పెట్టుకుంటే తగ్గుతుంది.
8/10మనిషికి సరిపడినంత అంటే రోజుకు ఎనిమిది గంటలు నిద్ర పోవాలి. దీంతోపాటు పోషకాహారం తీసుకుంటే కండ్లు మిలమిలా మెరుస్తాయి.
9/10కొన్ని బాదం పప్పులను బాగా నానబెట్టి మెత్తని పేస్టులా చేయాలి. అందులో కొంచెం పాలు కలిపి రాత్రి పడుకునే ముందు కంటి చుట్టూ రాసుకోవాలి. నిద్ర లేవగానే చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి.
10/10టమాటా గుజ్జు, నిమ్మరసం, శనగపిండి, పసుపు బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కండ్ల చుట్టూ బాగా రాసుకొని 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజుకి ఒకసారైనా ఇలా చేస్తే కళ్ల చుట్టూ ఉండే నల్లని వలయాలు త్వరగా తగ్గుతాయి.