చిన్నారుల్లో ఇమ్యూనిటీ కోసం ఇవి పెట్టండి…

హైదరాబాద్, మే 23: కరోనా సమయంలో ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇందుకోసం బలమైన ఆహారాన్ని తినాలి.పైగా, పెద్ద వాళ్ళు పాటించినన్ని జాగ్రత్తలు కూడా చిన్న పిల్లలు పాటించరు. కానీ వారి ఇమ్యూనిటీ పెరగాలంటే వారు సరిగ్గా ఆహారం తీసుకునేలా చేయడం తప్పని సరి. పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగాలంటే ఈ ఫుడ్స్ వారికి తినిపించండి.
కోడిగుడ్డు పచ్చసొనలో ఐరన్, విటమిన్ ఎ, డి ఉంటాయి. ఎగ్‌వైట్‌లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లను అడ్డుకునేందుకు తోడ్పడతాయి. పాలకూర, మెంతి, బ్రకోలీ, మునగాకులు…వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఫోలిక్ ఆసిడ్, ఐరన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. వారంలో కనీసం మూడురోజులు వీటిని తీసుకుంటే ఇమ్యూనిటీకి ఢోకా ఉండదు.

స్వీట్‌కార్న్‌లో విటమిన్ బి12, ప్రొటీన్స్, ఫైబర్ అధికంగా లభిస్తాయి. సలాడ్, సూప్స్ రూపంలో ఇతర డిష్‌లతో కలిపి తీసుకున్నా ఇమ్యూనిటీ పెరుగుతుంది. విటమిన్ ‘ఎ’ అత్యధికంగా కందగడ్డలో లభిస్తుంది. అంతేకాకుండా ఫోలికాసిడ్, ఫైబర్ కూడా ఉంటాయి. వారంలో రెండు రోజులు తిన్నా చాలా ప్రయోజనం ఉంటుంది.
తులసిలో కాల్షియం, పొటాషియం, జింక్, యాంటీకేన్సర్ గుణాలుంటాయి. తులసిని గ్రీన్‌టీతో తీసుకోవచ్చు. సలాడ్స్‌తో కలిపి తీసుకోవచ్చు. వాల్ నట్స్, బాదం, వేరుశెనగ, పొద్దుతిరుగుడు వంటివి ఎక్కువగా తినాలి. వీటిలో ఉండే ప్రొటీన్స్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్, ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్ ఇమ్యూనిటీని పెంచుతాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

