భోపాల్ : గ్రీన్ టీతో ఆరోగ్య ప్రయోజనాలపై ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించగా తాజాగా ఇందులో ఉండే పదార్ధాలు కొవిడ్-19, మధుమేహం, వయో సంబంధ అనారోగ్య సమస్యలను నివారిస్తాయని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి (ఐఐఎస్ఈఆర్) భోపాల్ శాస్త్రవేత్తలు గుర్తించారు. జర్నల్ మాలిక్యులర్ అండ్ సెల్యూలార్ బయోకెమిస్ట్రీలో ప్రచురితమైన రివ్యూ పలు కీలక అంశాలను వెల్లడించింది.
కొవిడ్-19, ఏజింగ్, మధుమేహం..బయోమాలిక్యులర్ రిలేషన్స్ మధ్య బంధాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. గ్రీన్ టీ, కొకొవ, బెర్రీస్‌లో ఉండే కెటచిన్స్, యాపిల్స్, గ్రేప్స్‌లో ఉండే ప్రొసీనిడిన్స్, బ్లాక్ టీలో ఉండే థెఫ్లావిన్లు కరోనా సహా పలు వైరస్లు, మధుమేహం, ఏజింగ్‌తో వచ్చే సమస్యల చికిత్సలో ఉపకరిస్తాయని కనుగొన్నారు. రపామైస్లిన్ వంటి యాంటీ ఏజింగ్ మందులు, మధుమేహానికి వాడే మెట్ఫార్మిన్ ఔషధాలు కొవిడ్-19 చికిత్సకూ పనికివస్తాయని గుర్తించారు.