Health Tips | మెనోపాజ్ వస్తున్న కారణంగానేమో కోపం, చిరాకు పెరిగిపోతున్నాయి.. తగ్గేదెలా?
Health Tips | మీకు నెలసరి సక్రమంగా రావట్లేదూ అంటే మెనోపాజ్ దశకు దగ్గర అవుతున్నట్టు. దీన్ని మెనోపాజల్ ట్రాన్సిషన్ అంటాం. వరుసగా 12 నెలలు నెలసరి రాకుండా ఉంటేనే దాన్ని మెనోపాజ్‌గా పరిగణించాలి.
నా వయసు 50 సంవత్సరాలు. నెలసరి సక్రమంగా రావట్లేదు. మెనోపాజ్ వస్తున్న కారణంగానేమో కోపం, చిరాకు పెరిగిపోతున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడి.. ప్రశాంతంగా బతికే మార్గం చెప్పండి. ఓ పాఠకురాలు
మీకు నెలసరి సక్రమంగా రావట్లేదూ అంటే మెనోపాజ్ దశకు దగ్గర అవుతున్నట్టు. దీన్ని మెనోపాజల్ ట్రాన్సిషన్ అంటాం. వరుసగా 12 నెలలు నెలసరి రాకుండా ఉంటేనే దాన్ని మెనోపాజ్‌గా పరిగణించాలి. పదకొండు నెలలు రాకుండా, పన్నెండో నెల వచ్చినా మెనోపాజ్‌గా లెక్కించలేం. అయితే, ఈ ఎగుడుదిగుళ్లు శరీర స్వభావాన్ని బట్టి రెండుమూడేండ్ల పాటు కొనసాగుతాయి. ఈ సమయంలో కోపం, చిరాకుతో పాటు రాత్రిపూట ఉన్నట్టుండి వేడి ఆవిర్లు వస్తుంటాయి. ఏసీ గదిలో ఉన్నాసరే, నిమిషాల్లో ఒళ్లు చెమటలు పడుతుంది, గుండె దడదడలాడిపోతుంది.
ఈ సమస్యను హాట్ ఫ్లాషెస్గా పిలుస్తాం. కొంతమందిలో డిప్రెషన్ లక్షణాలూ కనిపిస్తాయి. ఊరికే పెద్దగా ఏడ్వడం, అరవడంలాంటివీ చేస్తుంటారు. ఇవన్నీ శరీరంలో హార్మోన్ల తేడా వల్ల జరుగుతాయి. అయితే మంచి గైనకాలజిస్టు దగ్గరికి వెళితే హార్మోన్ థెరపీ ఇస్తారు. ఆ మందులు కొంతకాలం వాడటం వల్ల మీ పరిస్థితిలో మార్పు రావచ్చు. ఈ సమయంలో మమోగ్రామ్, పాప్‌స్మియర్‌తో పాటు బీపీ, షుగర్ టెస్టులూ చేయించుకోవడం మంచిది. మీ ఆరోగ్యం పట్ల పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. విటమిన్ డి, క్యాల్షియం తగ్గిపోవడం కూడా ఎముకల నొప్పులకు కారణమే. వీటికీ మందులు వాడాలి. డాక్టరును సంప్రదిస్తే తప్పక మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇటీవల మెనోపాజల్ క్లినిక్స్ పేరిట ప్రత్యేకంగా ఆసుపత్రులూ ఉంటున్నాయి. అవీ ప్రయత్నించవచ్చు. కోపతాపాల కారణంగా బంధాలు దెబ్బతినకుండా జాగ్రత్తపడండి.
డాక్టర్ పి. బాలాంబ సీనియర్ గైనకాలజిస్ట్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

