గర్భంతో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఐఏఎస్ ఆఫీసర్ చెప్పిన స్వీయ అనుభవం ఇది
Durga shakti Nagpal | పెండ్లయిన ప్రతి అమ్మాయీ అమ్మతనాన్ని కోరుకుంటుంది. తల్లి కాబోతున్నానన్న ఆనందం ఒకపక్క, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అనే కంగారు మరోపక్క.. ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అలాంటి తల్లులకు తన పుస్తకం ద్వారా సొంత అనుభవాలను తెలియజేశారు ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ దుర్గాశక్తి నాగ్పాల్. తాను రాసిన ‘గ్రో యువర్ బేబీ.. నాట్ యువర్ వెయిట్’లో తనదైన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి వివరంగా చెప్పు కొచ్చారు.
“ఎలాంటి ఇబ్బందులూ లేకుండా కాన్పు జరగడం అంత తేలికైన విషయం కాదు. నేను గర్భిణిగా ఉన్నప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాను. తొమ్మిది నెలల్లో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. అందుకే సాటి మహిళలకు కొన్ని సలహాలు ఇవ్వాలనుకున్నాను. ముఖ్యంగా గర్భంతో ఉన్నప్పుడు బిడ్డ పెరుగుదలపై దృష్టి పెట్టాలి తప్ప, బరువు పెరగడం మీద కాదు. నేనైతే ఈ విషయంలో స్వీయ క్రమశిక్షణ పాటించాను. ఎప్పటికప్పుడు బరువు చూసుకుంటూ, పోషకాహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశాను. ఎక్కువమంది పోషకాహారంపైనే దృష్టి పెడతారు. నిజానికి ఆహారంతోపాటు మానసిక ప్రశాంతత, వ్యాయామం కూడా ముఖ్యమే. నేను రోజూ ఉదయం నడక, ధ్యానం, యోగా చేసేదాన్ని’ అని వివరించారు దుర్గాశక్తి. ఆమె ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లి. ఈ పుస్తకానికి బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ముందుమాట రాయడం విశేషం.
Read More :
pregnancy cesarean | అధిక బరువు ఉంటే సిజేరియన్ అవసరమా?”
Pre eclampsia | గర్భిణుల్లో ఈ సమస్య అంత ప్రాణాంతకమా? దీని నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
Pregnancy Tips | ఏ సమయంలో కలిస్తే పిల్లలు పుడతారు?
థైరాయిడ్ సమస్య ఉంటే పిల్లలు పుట్టరా?
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- health tips
- pregnancy
- Pregnant
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

