ఆరు నెలలుగా మా ఆవిడ ముట్టుకోనివ్వడం లేదు.. ఏం చేయమంటారు?
ఈ మధ్య ఆరు నెలలుగా ఆమె నన్ను అస్సలు ముట్టుకోనివ్వడం లేదు. దీనివల్ల ఆమెపై నా అనుమానం మరింత పెరుగుతున్నది. ఈ పరిస్థితిని భరించలేకపోతున్నా. ఏం చేయమంటారు?
నా భార్యా, నేనూ ఉద్యోగాల వల్ల వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నాం. వారం నుంచి పదిరోజులకు ఒకసారి కలుసుకుంటాం. నాకు ఏడాదిగా శీఘ్రస్ఖలన సమస్య ఉంది. దీనివల్ల నా భార్య అసంతృప్తికి లోనవుతుందనిపిస్తుంది. ఆమె నర్సుగా పనిచేస్తుంది. తనకు వేరే ఎవరితోనే సంబంధాలు ఉన్నాయన్న అనుమానం కలుగుతుంది. రెండు, మూడుసార్లు అడిగితే ‘అటువంటిదేం లేదు, నీతో నేను హ్యాపీగా ఉన్నాను. నిందలు వేయకు’ అని ఏడ్చింది. మెల్లగా మా మధ్య గొడవలు జరిగి దూరం పెరిగింది. ఈ ఒక్కటి తప్ప తనను నేను చాలా ప్రేమగా చూసుకునేవాడిని. ఈ మధ్య ఆరు నెలలుగా ఆమె నన్ను అస్సలు ముట్టుకోనివ్వడం లేదు. దీనివల్ల ఆమెపై నా అనుమానం మరింత పెరుగుతున్నది. ఈ పరిస్థితిని భరించలేకపోతున్నా. ఏం చేయమంటారు?
– ఓ సోదరుడు

ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో పనిచేసే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉంటే దూరాలు పెరుగుతాయి. నువ్వు శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడుతూ, దానివల్ల నీ భార్య సుఖపడటం లేదని తీర్మానించుకొని, ఆమెపై అనుమానం పెంచుకున్నావు. ఆమెను వేధిస్తూనే, తను నీకు దూరం అవుతుందని బాధపడుతున్నావు. ఆమె నీకు దూరమైంది సెక్స్‌లో అసంతృప్తి వల్ల కాదు. నీలోని అనుమాన పిశాచి వల్ల. ముందు నువ్వు ఆమెకు క్షమాపణలు చెప్పు. తర్వాత వారంలో కనీసం రెండుసార్లు కలుసుకోండి. సెక్స్గ్యాప్ ఎక్కువైనా శీఘ్రస్ఖలన సమస్య వస్తుంది. ఇది అంగస్తంభన సమస్యకు దారితీయొచ్చు. కాబట్టి, సెక్సాలజిస్ట్‌ను కలవండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు తొలగించుకోండి. కలిసి మాట్లాడుకోండి. వైరుధ్యాలను పరిష్కరించుకోండి. అలాగే, అంగస్తంభన కాలాన్ని పెంచే, శీఘ్ర స్ఖలనాన్ని తగ్గించే టెక్నిక్స్, డీప్ రిలాక్సేషన్ సూత్రాలు ఫాలో అవ్వండి.
నా వయసు 23 ఏండ్లు. 13 ఏండ్ల వయసులో నాకు హస్త ప్రయోగం అలవాటైంది. నా అంగం చిన్నగా, మెత్తగా అయింది. వీర్యం కూడా తగ్గింది. నన్ను ఒక అమ్మాయి ప్రేమించింది. పెండ్లికి వాళ్ల ఇంట్లో ఒప్పించింది. తనంటే నాకూ ఇష్టమే! కానీ, నేను పెండ్లికి పనికొస్తానా?
– ఓ సోదరుడు
హస్తప్రయోగానికి, శీఘ్ర స్ఖలనానికి సంబంధం లేదు. హస్త ప్రయోగం తప్పన్న గిల్టీ ఫీలింగ్‌తో, ఎవరైనా చూస్తారేమోనన్న భయంతో దొంగతనంగా, త్వరత్వరగా చేసుకుంటే ఆందోళనకు లోనై, శీఘ్రస్ఖలన సమస్య వస్తుంది. అలాగే, ప్రొస్టేట్ గ్రంథి, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, స్ఖలనాన్ని పట్టి ఉంచే సెక్స్ కండరాల మీద పటుత్వం లేకపోవడం తదితర కారణాలు శీఘ్ర స్ఖలనానికి దారితీయవచ్చు. తీవ్రమైన పర్ఫార్మెన్స్ యాంగ్జయిటీ కూడా ప్రధాన కారణం. దీనికి చికిత్స ఉంది. శీఘ్రస్ఖలనానికి చికిత్స తీసుకోకపోతే అంగస్తంభన సమస్యకు దారితీస్తుంది. సెక్సాలజిస్ట్‌ని కలిసి, పెండ్లికి ముందే చికిత్స తీసుకోవడం మంచిది. నువ్వు సెక్స్‌కి పనికొస్తావు. నిపుణుల కౌన్సెలింగ్ తీసుకో.
డాక్టర్ భారతి
సెక్సాలజిస్ట్, సైకోథెరపిస్ట్, రైస్ హాస్పిటల్,
హస్తినాపురం, హైదరాబాద్.
ఈ మెయిల్: bharathid506@gmail.com
Read More :
నెలంతా నైట్ షిఫ్టులు చేయాల్సి వస్తుంది.. మావారు నా ఫీలింగ్స్‌ను ఏమాత్రం పట్టించుకోవడం లేదు.”
“నా భర్తతో కలయిక అంటేనే చెమటలు పట్టి స్పృహ తప్పినంత పని అవుతున్నది”
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Doubts
- Husband
- husband doubt
- Wife
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

