నా వయస్సు 40 సంవత్సరాలు. మా వారికి 42. మాకు ఒక పాప, బాబు. నేను స్కూల్లో టీచర్‌గా పని చేస్తాను. మా వారు ‘పాలిటిక్స్’ అంటూ తిరుగుతుంటారు. సంపాదన లేదు. తనకు పరిచయం ఉన్న కొందరు స్త్రీలతో సంబంధంలో ఉన్నారు. వారితో ఫోన్లో గంటలకొద్దీ మాట్లాడుతుంటారు. మాట్లాడటమే కాదు, ఆ సమయంలో హస్త ప్రయోగం కూడా చేస్తుంటారు. బెడ్‌పై కూడా వాళ్ల పేర్లే కలవరిస్తారు. నిలదీస్తే.. ‘అలా ఫోన్ సెక్స్ చేయకపోతే పిచ్చెక్కుతుంది’ అంటారు. అతని అలవాటుతో నాకు జీవితం మీదే విరక్తిగా ఉంది. ఈ విషయంలో మా మధ్యన చాలాసార్లు గొడవైంది. ఒక్కోసారి చచ్చిపోవాలని అనిపిస్తుంది. విడాకుల గురించి కూడా ఆలోచించా! పిల్లలు గుర్తొచ్చి ఆ ప్రయత్నాలు మానుకున్నా. ఈయనకు ఇదేం వ్యసనం? దీనికి చికిత్స ఉందా?
– వి.ఎస్., నెల్లూరు
ఆన్లైన్లో, టీవీలో, ఫోన్లో, పుస్తకాల్లో, అశ్లీల పత్రికల్లో.. ప్రతిచోటా శృంగారానికి సంబంధించిన సమాచారం ఉంటుంది. అంతేకాదు, మనుషుల్లోనూ శృంగారంపట్ల తీవ్రమైన ఇష్టం, నిగ్రహించుకోలేని బలహీనత, వ్యసనం రోజురోజుకూ తీవ్రం అవుతున్నది. యూఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పరిశోధనల ప్రకారం.. మనుషుల్లో మితిమీరిన శృంగార వాంఛ అనేది వదిలించుకోలేని ఒక బలహీనతగా మారుతున్నది. శృంగారానికి సంబంధించిన ఆలోచన, దాని చుట్టూ అల్లుకునే చర్యలు, సంభోగ ఆసక్తి .. చివరికి భార్యాభర్తల బంధాన్ని బలహీన పరుస్తున్నాయి. ఒకరి పట్ల ఒకరికి నమ్మకం లేకుండా చేస్తున్నాయి.
ఇలాంటి వారు తీవ్రమైన శృంగార వాంఛతో రగిలిపోతుంటారు. పదే పదే శృంగారంలో పాల్గొనాలని తపిస్తుంటారు. సెక్స్‌లో పాల్గొనకుండా ఉండలేని మానసిక స్థితిలోకి వెళ్లిపోతుంటారు. ఈ మనో స్థితిలో ఉన్నవారు పదేపదే టీవీలు, ఫోన్లు, ఆన్లైన్లో నీలి చిత్రాలు చూస్తుంటారు. రోజులో ఎక్కువసేపు సెక్స్‌కు సంబంధించిన ఆలోచనలతోనే గడిపేస్తుంటారు. తమ వాంఛను తీర్చుకోవడానికి ఎంత రిస్క్ అయినా తీసుకొంటారు. ఇందుకోసం ఏకకాలంలో అనేక మందితో సంబంధాలు నెరపుతారు. బహిరంగ స్థలాల్లో కూడా పశువాంఛను ప్రదర్శిస్తుంటారు. తమ అసహజ లైంగిక ప్రవర్తనకు ఎదుటివారే కారణమని నిందిస్తుంటారు. వీళ్లలో బాంధవ్యాలు, ప్రేమలు ఉండవు. కోరిక తీర్చుకోవడమే లక్ష్యం. అందుకే వీళ్లలో ఎక్కువగా ఆన్లైన్ పోర్నోగ్రఫీ లేదా ఫోన్ సెక్స్‌కు అడిక్ట్ అయిపోతుంటారు. కాగ్నిటివ్ థెరపీ, బీఎంటీ, ఎవర్షన్ థెరపీ, కౌన్సెలింగ్ ద్వారా ఈ రకమైన మనో లైంగిక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీ వారిని వెంటనే ఓ మంచి సెక్సాలజిస్టుకు చూపించండి. వైద్యం తర్వాత అతనిలో తప్పకుండా మార్పు కనిపిస్తుందని ఆశిద్దాం. ఆ ప్రయత్నమూ విఫలమైతే.. మీ జీవితం ఎలా ఉండాలన్నది మీరే నిర్ణయించుకోండి.
– డా. భారతి (ఎమ్మెస్), మారిటల్ కౌన్సిలర్, సైకోథెరపిస్ట్,
జయా హాస్పిటల్, బీ.ఎన్. రెడ్డి నగర్ క్రాస్‌రోడ్, హైదరాబాద్
bharathid506@gmail.com, 7989227504
నా భర్త నన్ను ముద్దులతో ముంచెత్తాలని ఉంటుంది.. కానీ ఆయన మాత్రం..”
“నేను ప్రేమించిన వాడికి అబ్బాయిలంటేనే ఇష్టం.. అతన్ని అసలైన మగాడిగా ఎలా చేయాలి?”
“పక్కింటి ఆంటీకి నా వల్ల పాప పుట్టింది.. ఇప్పుడు బాబు కావాలని అంటున్నరు”
“ఆంటీతో వారానికి కనీసం నాలుగు సార్లయినా శారీరకంగా కలుస్తున్నా.. ఇప్పుడు భయమేస్తోంది..”
“పెండ్లయి మూడేండ్లు అవుతుంది.. మా ఆయన స్పర్శలో ఒక్కసారి కూడా ఆనందం కలగలేదు”