మాకు ఇటీవలే వివాహమైంది. నాకు శృంగార విషయాలపై కనీస అవగాహన లేదు. స్నేహితురాళ్లు చెప్పిన కొన్ని విషయాలు నాకు శృంగారంపై భయాన్ని పెంచాయి. దీంతో రాత్రి అయ్యిందంటేనే మానసిక ఒత్తిడికి, తీవ్ర ఆందోళనకు గురవుతున్నా. మా వారిని కూడా దూరంగా ఉంచుతున్నా. దీంతో ఆయన కోపగించుకుంటున్నారు. ప్రతి చిన్న విషయానికీ చికాకు పడుతున్నారు. వివాహమైన తొలినాళ్లలోనే నా సంసార జీవితం నరకంగా మారిందని అనిపిస్తున్నది. మా సమస్యకు మీరే పరిష్కారం చెప్పాలి.
– వీహెచ్, మెదక్
ఛాందస కుటుంబాలకు చెందిన అమ్మాయిల్లో సహజంగానే శృంగారంపై అవగాహన తక్కువ. ఇక స్నేహితులు ఇచ్చే తెలిసీతెలియని సలహాలతో పాటు.. శృంగారం పట్ల ఉన్న వ్యతిరేక భావాలు.. సంసార జీవితంలోతీవ్ర సమస్యలను సృష్టిస్తాయి. ముఖ్యంగా కలయిక వల్ల నొప్పి, రక్తస్రావం అవుతుందనే ఆందోళన.. మహిళల్లో శృంగారం పట్ల భయాన్ని మరింత పెంచుతుంది.
..వీటిలో కొన్ని అనుమానాలు, ఆందోళనలు సహజమైనవే. ఎవరినీ తప్పు పట్టలేం. వాటిని ప్రీ, పోస్ ్టమ్యారిటల్ కౌన్సెలింగ్ ద్వారా ఆ భయాన్ని తగ్గించవచ్చు. శాస్త్రీయమైన విశ్లేషణ ద్వారా ఆందోళనలను దూరం చేయవచ్చు. కానీ, కొన్ని రకాల అపోహలకు హేతువు ఉండదు. మూఢనమ్మకాలు అశాస్త్రీయ ఆలోచనా ధోరణిని పెంచిపోషిస్తాయి. ఆందోళనలో ఉన్నప్పుడు.. మెదడు కొన్ని ప్రమాదకర రసాయనాలను విడుదల చేస్తుంది. కిడ్నీలపై ఉండే అడ్రినలిన్ గ్రంథి ద్వారా విడుదలయ్యే ఈ రసాయనాలు శృంగార జీవితంలో సమస్యలను సృష్టిస్తాయి. ముఖ్యంగా స్త్రీలలో కలిగే ఆందోళన వల్ల యోని కండరాలు బిగుసుకుపోతాయి. ఫలితంగా అంగప్రవేశం దుర్భరమై, తీవ్రమైన నొప్పి కలుగుతుంది. ఈ స్థితి అలానే కొనసాగితే సంతానం కలిగే అవకాశం తగ్గుతుంది. భావప్రాప్తి కూడా పూర్తి స్థాయిలో పొందలేరు. ఈ వైఫల్యం ఆందోళనలను మరింత పెంచి, కాపురంలో సమస్యలకు కారణం అవుతుంది. అయితే, ట్రాంక్విలైజర్స్ వాడితే ఆందోళన స్థాయి పడిపోతుందని చాలామంది అనుకుంటారు. అది పూర్తిగా తప్పు. మానసిక చికిత్స, కౌన్సెలింగ్, డీపర్ రిలాక్సేషన్ టెక్నిక్స్, సెక్స్ థెరపీ మొదలైనవి మాత్రమే సమర్థంగా పనిచేస్తాయి. దీనివల్ల ఆందోళనను నియంత్రించుకుని, ప్రశాంతమైన శృంగార జీవితాన్ని గడపగలరు.
– డా. భారతి (ఎమ్మెస్), మారిటల్ కౌన్సిలర్, సైకోథెరపిస్ట్,
జయా హాస్పిటల్, బీ.ఎన్. రెడ్డి నగర్ క్రాస్‌రోడ్, హైదరాబాద్
bharathid506@gmail.com, 7989227504
“డెలివరీ అయిన్నాటి నుంచి ఆయన ఇలాంటి కంప్లయింట్స్ చేస్తున్నరు”
“నా భర్త నన్ను ముద్దులతో ముంచెత్తాలని ఉంటుంది.. కానీ ఆయన మాత్రం..”