Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Vegetable Nutrition | ఒక్కో కూరగాయ, ఆకు కూరతో.. శరీరానికి ఒక్కోరకమైన ప్రయోజనం కలుగుతుంది. అయితే, వంటలో లోపాల వల్ల.. కొన్ని ప్రయోజనాలు అందకుండా పోతాయి. అలా కాకుండా ఉండాలంటే.. ఈ కింది చిట్కాలు పాటిస్తే సరి!
Vegetable Nutrition | ‘ఆహారం’ అనేది కడుపు నింపడమే కాదు.. ఆరోగ్యానికీ భరోసా అందిస్తుంది. ఒక్కో కూరగాయ, ఆకు కూరతో.. శరీరానికి ఒక్కోరకమైన ప్రయోజనం కలుగుతుంది. అయితే, కొందరిలో కొన్ని కూరగాయలు అలర్జీని కలగజేస్తాయి. వంటలో లోపాల వల్ల.. కొన్ని ప్రయోజనాలు అందకుండా పోతాయి. అలా కాకుండా ఉండాలంటే.. ఈ కింది చిట్కాలు పాటిస్తే సరి!
– కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ, చేదుగా ఉంటుందని తినడానికి ఆసక్తి చూపించరు. అదే.. కాకరకాయ కూరకు కొద్దిగా కొబ్బరి తురుము, నువ్వుల పొడి జోడించి చూడండి. చేదు ఎగిరిపోయి.. మరింత రుచికరంగా తయారవుతుంది.
– కూరగాయల్లో రారాజుగా వంకాయను కీర్తిస్తారు. అయితే, కొన్నిరకాల వంకాయలు.. అలెర్జీలను కలిగిస్తాయి. అలాంటివి తింటే.. గొంతులో దురద, చర్మంపై దద్దుర్లు లాంటి సమస్యలు వస్తాయి. అందుకే.. వంకాయను వండేటప్పుడు కూరలో కొన్ని మెంతి గింజలను వేస్తే సరి. దీనివల్ల మంట తగ్గుతుంది. రక్తం కూడా శుద్ధి అవుతుంది.
– పాలకూర నుంచి ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. కానీ, ఆహారంలో సహజంగా ఉండే ఆక్సలేట్ కారణంగా.. ఆ ఐరన్‌ను శరీరం పూర్తిగా శోషించుకోలేదు. పాలకూరకు కొద్దిగా నిమ్మకాయ, నల్లమిరియాలు కలిపితే.. ఐరన్ శోషణ మెరుగు పడుతుంది.
– ఆలుగడ్డలను చాలామంది ఇష్టంగా తింటారు. కానీ, అందులో అధికంగా లభించే పిండి పదార్థం.. కొంతమందిలో మలబద్ధకం సమస్యను కలిగించవచ్చు. అలా కావొద్దంటే.. ఆలుగడ్డలను ఉడికించేటప్పుడు కొంచెం ఆవాలు కలపండి. అవి పిండి పదార్థాన్ని విచ్ఛిన్నం చేసి.. మలబద్ధకం రాకుండా చేస్తాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

