Honey Water | తేనెను రోజూ తీసుకోవడం వల్ల ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. తేనెను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. జీర్ణవ్యవస్థ శుభ్రంగా మారుతుంది. మలబద్దకం, గ్యాస్ వంటివి ఉండవు. శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో రోగాల నుంచి రక్షణ లభిస్తుంది. ఇన్ఫెక్షన్ల నుంచి బయట పడవచ్చు. తేనె వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ముడతలు పడకుండా చూసుకోవచ్చు. యవ్వనంగా కనిపిస్తారు.
తేనెను తీసుకుంటే మనస్సు ప్రశాంతంగా మారుతుంది. మూడ్ మారుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. గాయాలు, పుండ్లపై తేనెను రాస్తుంటే అవి త్వరగా మానుతాయి. తేనెను తీసుకోవడం వల్ల శరరీంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో బీపీ నియంత్రణలోకి వస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా తేనెతో మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
అయితే తేనెను చాలా మంది వెచ్చని నీటితో తీసుకుంటుంటారు. కరెక్టే. కానీ నీళ్లు మరీ వేడిగా ఉండకూడదు. గోరు వెచ్చగానే ఉండాలి. గోరు వెచ్చని నీటిలోనే తేనెను కలిపి తాగాలి. నీళ్లు మరీ వేడిగా ఉంటే అలాంటి నీటిలోని తేనెలో ఉండే పోషకాలు అన్నీ నశిస్తాయి. అలాంటప్పుడు అలాంటి తేనెను తాగినా పెద్దగా ప్రయోజనం ఉండదు. కనుక తేనెను ఎల్లప్పుడూ గోరు వెచ్చని నీటిలోనే కలుపుకుని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.
డయాబెటిస్ ఉన్నవారు తేనెను తీసుకోవచ్చు. కానీ డాక్టర్ సలహా మేరకు తేనెను వాడుకుంటే మంచిది. ఇక తేనె నీళ్లలో కాస్త నిమ్మరసం కలిపి తాగితే ఇంకా మేలు చేస్తుంది. కానీ గ్యాస్ ట్రబుల్, అసిడిటీ వంటి సమస్యలు ఉన్నవారు నిమ్మరసం కలపకూడదు. వట్టి తేనె నీళ్లనే తాగాలి. తేనె నీళ్లు కొందరిలో అలర్జీలను కలిగించే అవకాశాలు ఉంటాయి. కనుక అలాంటి వారు ఈ నీళ్లను సేవించకూడదు.
తేనె నీళ్లను ఉదయం పరగడుపున తాగాల్సి ఉంటుంది. తరువాత 30 నిమిషాల వరకు ఏమీ తినరాదు, తాగరాదు. ఇలా కనీసం 30 రోజుల పాటు చేస్తే ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తాయి. ఈ విధంగా తేనె నీళ్లను తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. అధిక బరువు సులభంగా తగ్గుతారు. కనుక బరువు తగ్గాలని చూస్తున్నవారికి తేనె నీళ్లు గొప్ప ఔషధంగా పనిచేస్తాయి. ఇలా తేనె నీళ్లను తాగడంలో పలు జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది.