Homemade Drinks : యూరిక్ యాసిడ్ అనేది శరీరంలో ప్యూరిన్ల జీవక్రియ ద్వారా ఉత్పత్తి చేయబడిన సహజ వ్యర్థ ఉత్పత్తి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగితే గట్, కిడ్నీలో రాళ్లు చేరడం వంటి పరిస్ధితులకు దారితీస్తుంది. అధిక యూరిక్ యాసిడ్ లెవెల్స్‌ను నియంత్రించేందుకు హైడ్రేషన్ ప్రేరేపించేలా, కిడ్నీ పనితీరును మెరుగుపరిచేలా చేసే కొన్ని ఇంట్లో తయారుచేసుకునే పానీయాలు ఉపకరిస్తాయి.
ఇవి శరీరంలో వాపు ప్రక్రియను కూడా నివారిస్తాయి. నిమ్మ రసం శరీరంలో పీహెచ్ స్ధాయిలను బ్యాలెన్స్ చేయడంతో పాటు ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ కరిగేలా చేస్తుంది. గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి ఉదయాన్నే తీసుకుంటే మెరుగైన ఫలితాలు లభిస్తాయి.
యాపిల్ సైడర్ వెనిగర్ డ్రింక్ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ పానీయం జీర్ణశక్తిని ప్రేరేపించి యూరిక్ యాసిడ్‌ను తొలగించడంలో తోడ్పడుతుంది. ఇక యూరిక్ యాసిడ్ లెవెల్స్‌ను నియంత్రించే డ్రింక్స్‌ను పరిశీలిస్తే…
నిమ్మ రసం
యాపిల్ సైడర్ వెనిగర్ డ్రింక్
చెర్రీ జ్యూస్
అల్లం టీ
పసుపు పాలు
కీరా
వాటర్మెలన్ జ్యూస్
బేకింగ్ సోడా సొల్యూషన్
Read More :