Jake Gyllenhaal | హాలీవుడ్ నటుడు జేక్ గైలెన్హాల్ బాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి కనబరిచారు. నటించడమే కాకుండా దేశీ సినిమాల్లో ఆడి పాడాలని ఉందని చెప్పుకొచ్చారు. తన న్యూ ప్రైమ్ వీడియో ఫిల్మ్ రోడ్‌హౌస్ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ హిందీ సినీ పరిశ్రమలో పనిచేయాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు.
బాలీవుడ్లో ఎంతోమంది టాలెంటెడ్ నటులున్నారని, ఇక్కడి సినిమాలు అద్భుతంగా తెరకెక్కుతున్నాయని, అభిమానుల నుంచి నటులకు అనూహ్య మద్దతు లభిస్తుందని అన్నారు. భారత్ అన్నా తనకు అమితమైన ఇష్టమని, ఇక్కడి సినిమాల్లో సానుకూల వాతావరణం తనను కట్టిపడేసిందని చెప్పారు.
హాలీవుడ్లో పురాతన ట్రెండ్ బాలీవుడ్లో గమనించానని, ఇక్కడ బహుముఖ ప్రజ్ఞ కనబరిచే నటులుండటం గొప్ప విషయమని జేక్ గైలెన్హాల్ పేర్కొన్నారు. జేక్ ప్రస్తుతం రోడ్హౌస్లో కనిపించారు. జేక్ గైలెన్హాల్, డేనియల్ మెల్చిర్, కనోర్ మెక్ గ్రెగర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
Read More :
Mrunal Thakur | నక్షత్రంలా మృణాళ్ ఠాకూర్ మెరుపులు.. ట్రెండింగ్‌లో స్టిల్స్